దుమ్ము రేపుతున్న వెంకీ మామ.. సంక్రాంతి మూవీ 3 రోజులో ఎన్ని కోట్లంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. యంగ్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడది సంక్రాంతి బరిలో జనవరి 14న గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగాను దుమ్ము దులుపుతుంది. అలా మొదటి రోజే ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచిన వెంకీ మామ.. రెండో రోజు కూడా ఇంచుమించు అదే రేంజ్ కలెక్షన్లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూడో రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసుకోవాలని ఆసక్తి చాలామందిలో ఉంటుంది.

Sankranthiki Vasthunam movie Review: సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ,  వెంకీ - అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కొట్టారా...

ఒకసారి ఆ కలెక్షన్ల డీటెయిల్స్ ఏంటో చూద్దాం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాకు వీకే నరేష్, వీటిని గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలో మెప్పించారు. నటినటుల రెమ్యూనరేషన్.. ప్రమోషన్ ఖర్చులు అంతా కలిపి సినిమా బడ్జెట్ రూ.80 కోట్ల వరకు జరగగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఈ క్రమంలోని సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ రూ.42 కోట్ల మేర‌ జరగడం విశేషం. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ.85 కోట్లు కలెక్షన్లు రావాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గోదావరి గట్టు పై రామచిలుక సాంగ్ బీమ్స్ సిసిరోలియో అందించిన ఇతర పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

All the Sankranthiki Vasthunam Hyderabad shows are house full - NTV Telugu1300 స్క్రీన్ లలో ప్రసారమైన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే మొదటి రోజు రూ.45 కోట్ల ఓపెనింగ్స్‌ను రాబట్టి.. వెంకీ మామ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల‌గొట్టిన‌ సినిమాగా సంచలనం సృష్టించింది. పండగ పూట ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావాల్సిన విందు అందించాడు వెంకి. రెండో రోజు కూడా దాదాపు అదే రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయి. అలా.. సెకండ్ డే కలెక్షన్స్ రూ.32 కోట్లు కలెక్షన్లు రాగా.. రెండు రోజులకు కలిపి రూ.77 కోట్ల వరకు గ్రాస్ సాధించింది. ఈ వీకెండ్ నాటికీ సినిమా బ్రేక్ ఈవెన్ చాలా సులభం అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సంక్రాంతికి వస్తున్నాం మూడవరోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. పండగ సీజన్ ముగియడంతో కాస్త కలెక్షన్లు తగ్గుముఖం పట్టినప్పటికీ.. రూ.16.50 కోట్ల మేర గ్రాస్ వ‌సూళ్ళు కొల్లగొట్టనుందని సమాచారం.