స్పిరిట్ కు మ‌రింత లేట్‌.. సందీప్‌కు ఎదురు చూపులు త‌ప్పేలా లేవే..!

పాన్ ఇండియ‌న్ రెబ‌ల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలను లైన్లో పెట్టుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ నుంచి రానున్న ప్రతి ప్రాజెక్ట్ పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్‌ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాతో పాటు.. ఆయన మరో సినిమా ఫౌజి కి కూడా సిద్ధమవుతున్నాడు. హ‌నురాఘవపూడి డైరెక్షన్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్‌ ఉంటుందని అంత భావించారు.

Spirit - IMDb

స్పిరిట్ సినిమాను అప్పుడు ప్రారంభించాలని సందీప్ కూడా అనుకున్నారు. ఇలాంటి క్ర‌మంలో ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ మరింత కాలం వెయిట్ చేయడం తప్పేలా లేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ఇప్పటికే స‌లార్‌ 2 మరియు కల్కి 2 సినిమాలను పెండింగ్లో ఉంచారు. ఇక ఇప్పుడు కల్కి మేకర్స్ నుంచి ప్రభాస్ పై ఒత్తిడి మొదలైందని.. త్వరలోనే సీక్వెల్ సినిమా ప్రారంభించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నార‌ని.. 2026 లో సినిమాలో రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

Kalki 2898 AD box office: 5 reasons why Prabhas deserves all the love for  his impeccable portrayal – Firstpost

ఈ లెక్క ప్రకారం ప్రభాస్ క‌ల్కి సీక్వెల్ మూవీకి ఒప్పుకుంటే మరికొంత కాలం సందీప్ రెడ్డి వంగకు నిరీక్షణ తప్పదు అంటూ సినీ వర్గాల్లో టాక్‌ నడుస్తుంది. అంతే కాదు ప్ర‌శాంత్ నీల్ కూడా స‌లార్ 2 ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేసి రిలీజ్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియ‌దు కానీ ప్ర‌స్తుతం ఈ న్యూస్ తెగ వైర‌ల్‌గా మారుతుంది. ఈ క్ర‌మంలో ప్రభాస్ స్పిరిట్ సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తాడో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.