టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. గతేడాది చివర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పుష్ప గాడి ర్యాంపేజ్ చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సక్సస్ పరంగా అదర కొట్టడమే కాదు.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది. పాన్ ఇండియా క్రెజ్ అంటే ఏంటో అల్లు అర్జున్ కు రుచి చూపించింది.
సంక్రాంతి సినిమాల బర్రిలో ఉన్న పుష్ప 2 ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతుందంటే.. ఆ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. అయితే కొద్ది రోజుల క్రితమే మేకర్స్ మళ్లీ అదనపు నడివితో థియేటర్స్‌లో పుష్ప 2తో సందడి చేసేందుకు సిద్ధమవుతుందంటూ అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు. ఇలాంటి క్రమంలో పుష్ప 2 పెరిగిన నడివిపై కూడా ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. కాగా.. రేపు జనవరి 17 నుంచి.. పెరిగిన 20 నిమిషాలు నడివితో సినిమా వస్తుండడంతో.. దానకి తగ్గట్టుగానే టికెట్ ధరలను తగ్గించడంతో.. ఆడియన్స్‌లోను ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే తక్కువ ధరలను ఫిక్స్ చేసేసారు మేకర్స్. సింగిల్ స్క్రీన్ లలో అతి తక్కువగా రూ.112, మల్టీప్లెక్స్ లలో రూ.150గా మేకర్స్ పిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇంట్రెస్టింగ్‌గా తెలుగు స్టేట్స్‌లో సింగిల్ స్క్రీన్‌లలో మళ్లీ సాలిడ్ బుకింగ్స్ జరుగుతుండడం విశేషం. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే సినిమాకు భారీ లెవెల్‌లో రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే అదనపు నడివి కోసం ఫ్యాన్స్ ఎలా ఎదురుచూస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. ఇక తగ్గిన టికెట్ రేట్లతో పుష్ప 2 మరోసారి ఏ రేంజ్ లో బుకింగ్స్ చేసుకుంటుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.