డాకు మహారాజు ఊచకోత.. 4 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు ఎంతంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. ఈ సంక్రాంతి బరిలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కొల్లి బాబి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు నాగ వంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక బాలయ్య హేట్రిక్‌ సక్సెస్‌తో దూసుకుపోతున్న క్రమంలో.. రిలీజ్ అయిన డాకు మహారాజ్ పై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అంచ‌నాల‌కు తగ్గట్టుగానే సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ క్రమంలోనే బాలయ్య కెరీర్‌లో సరికొత్త రికార్డులను ఓపెన్ చేస్తూ దూసుకుపోతుంది డాకు మహారాజ్. అలా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రికార్డు వసూళ్లు అందుకోవడం విశేషం. మొత్తం నాలుగు రోజుల కంప్లీట్ రన్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల కలెక్షన్ల లెక్కలు ఎలా ఉన్నాయో ఏరియాల వారీగా ఒకసారి చూద్దాం.

డాకు మహారాజ్‌కు నాలుగో రోజు నైజంలో రూ.1.47 కోట్లు, సీడెడ్‌లో రూ.1.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1. 23 కోట్లు, గుంటూరులో 0.53 కోట్లు, కృష్ణ లో రూ.0.57 కోట్లు, తూర్పుగోదావరి రూ.0.72 కోట్లు, వెస్ట్ గోదావరి రూ.0.45 కోట్లు, నెల్లూరు రూ.0.28 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని ఏరియాలకు కలిపి ఏకంగా రూ.6.45 కోట్ల షేర్ వ‌సుళ‌ను సాధించి డాకు మహారాజ్ సంచలనం సృష్టించింది. నాలుగో రోజు కూడా ఈ రేంజ్‌లో సినిమా వసూళ‌ను సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇక మొత్తంగా నాలుగు రోజులకు కలిపి నైజంలో.. ఏకంగా రూ.10.15 కోట్ల కలెక్షన్లు కల్లగట్టగా, సీడెడ్‌లో రూ.9.87 కోట్లు కలెక్షన్లను సాధించింది. ఉత్తరాంధ్ర లో రూ.5.68 కోట్లు, గుంటూరులో రూ.5.89 కోట్లు, కృష్ణ రూ. 3.72 కోట్ల కలెక్షన్ దక్కించుకుంది.

Daku Maharaj Review: రివ్యూ: బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ ఎలా ఉంది?

తూర్పుగోదావరిలో రూ.4.16 కోట్ల కలెక్షన్లను సాధించింది. వెస్ట్ గోదావరి రూ.3.18 కోట్లు, నెల్లూరు రూ.2.49 కోట్ల షేర్‌వ‌సుళ‌ను సొంతం చేసుకుంది. ఇలా మొత్తంగా నాలుగు రోజులకు కలిపి డాకు మహారాజ్ రూ.45.14 కోట్ల షేర్ వ‌సూళ‌ను సాధించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోను భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న డాకు మహారాజ్.. కేవలం తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు ఈ రేంజ్‌లో ఉన్నాయంటే అది కూడా జీఎస్టీ కాకుండా.. ఇక ఓవర్సీస్ లో ఏ రెంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. డాకు మహారాజ్ ఫైనల్ ర‌న్‌ ముగిసేసరికి మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.