టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి బరిలో జనవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. ఇక రిలీజ్‌కు ముందే విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది. మొదటి రోజే ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్ వసూళను కొల్లగొట్టి వెంకీ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటిస్తూ.. తమ ఆనందాన్ని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోను సంక్రాంతి సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఓవర్సీస్‌లోనే సినిమాకు ఏడు లక్షల డాలర్లు వసూళ్ళు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సెకండ్ డే కలెక్షన్స్ ఏ రేంజ్‌లో కొలగొట్టిందో తెలుసుకోవాలని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే.. తాజాగా సెకండ్ డే కలెక్షన్స్ వివరాలను మేకర్స్ పోస్టర్ ద్వారా అఫీషియల్ గా వెల్లడించారు. రెండు రోజుల్లోనే రూ.77 కోట్ల గ్రాస్ వసూళను వెంకీ మామ కొల్లగొట్టాడంటూ వెల్లడించారు.
అంటే.. రెండో రోజు మొత్తంగా రూ.37 కోట్ల గ్రాస్ వసూళ్ళు వచ్చాయి. అంతేకాదు.. నేడు కూడా బుక్ మై షో లో వేలల్లో టికెట్స్ బుక్ అవుతున్న క్రమంలో.. ఈ సినిమా త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయమని సినీ వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు వెంకటేష్. తన కామెడీతో పాటు.. సినిమాలోని నటీనటుల అందరి పర్ఫామెన్స్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ క్రమంలోనే సినిమా భారీ లెవెల్లో కలెక్షన్లు కొల్లగొడుతుంది.