ఆ స్టార్ హీరో న‌న్ను న‌లిపేశాడు.. ప్ర‌భాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్‌..!

ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్లుగా అడుగు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది నటించింది అతి తక్కువ సినిమాలైనా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటారు. తర్వాత సినిమాలకు దూరమై ఇండస్ట్రీ నుంచి మాయమవుతారు. వారు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు.. అనేది కూడా చాలామందికి తెలియదు. అలా తెలుగులో పలు సినిమాల్లో నటించి చిటుకున కనుమ‌రుగైన హీరోయిన్లలో సంజన గల్రాని కూడా ఒకటి. తెలుగులో బుజ్జిగాడు సినిమాతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత అడపా ద‌డపా సినిమాల్లో కనిపించింది. అయితే ఇక్కడ ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాకపోవడంతో.. కన్నడ ఇండస్ట్రీలో అవ‌కాశాలు అందుకుంది. అక్క‌డ తన న‌ట‌న‌తో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. కాగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో.. డ్రగ్స్ కేసులో ఈమె ఆరోపణలు ఎదుర్కోవడం.. జైలు జీవితాన్ని అనుభవించడంతో అందరూ షాక్ అయ్యారు.

Wishing Darling #Prabhas a very Happy... - Sanjjanaa Galrani | Facebook

సంజన గల్రాని బెయిల్ పై బయటకు వచ్చి ఒక ముస్లిం డాక్టర్ని వివాహం చేసుకున్నారు. అయితే ఆమె లవ్ జిహాది బాధితురాలని అప్పట్లో చర్చలు కూడా వైరల్ అయ్యాయి. కాగా గతంలో ఓ తెలుగు ఇంటర్వ్యూలో పాల్గొన సంజన గ‌ల్రాన్ని ఓ కన్నడ స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి. గతంలో కన్నడ సినిమాలో నటించే సమయంలో ఒక కన్నడ హీరో తనని చాలా టార్చర్ చేశాడు అంటూ వివరించిన సంజ‌నా.. ఆ హీరో ప్రెస్టేజ్ ఉన్న హీరో అని.. అతని పేరు చెప్పను కానీ అతనితో సినిమాలో నటించా అంటూ వివరించింది.

It was a very overwhelming evening, as my husband & I along with @princealarik had a joyous time to meet up with the family of honorary Mla sir @naharismla . We gathered

ఆ సినిమాలో డ్యాన్సులు చేస్తున్న సమయంలో.. నా భుజాలు పట్టుకొని క‌ద‌పాల్సి ఉండగా.. అతనికి, డైరెక్టర్ కి గొడవ నడుస్తుందని.. డైరెక్టర్ యాక్షన్ చెప్పడంతో తన చేతి భుజాన్ని గట్టిగా పట్టేసుకుని నలిపేసాడు అని.. డ్యూడ్ ఇంత గట్టిగానా నాకు నొప్పి వస్తుంది అని చెప్పడంతో ఆ హీరో సారీ.. మేనేజ్ చేసుకో అని చెప్పాడని.. ఆ టైంలో తాను ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని హీరోయిన్ వివరించింది. ఇలా ఎన్నో ఇబ్బందులను షూట్ సమయంలో ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది. వెంటనే సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఆ హీరోకి నేనేం యాక్షన్ సీన్స్‌ నటించడం లేదు.. నేనేమీ రౌడీని కాదు అని చెప్పి వెళ్ళిపోయానని.. ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సంజనా గల్రాని చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారడంతో.. ఇంతకీ ఎవరా కన్నడ హీరో అని సర్చింగ్‌లు మొదలుపెట్టారు జనం.