రెండేళ్ళ‌లో ప్ర‌భాస్ నాలుగు సినిమాలు.. టార్గెట్ రీచ్ అవ్వ‌గ‌ల‌డా..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో ఎలాంటి బజ్‌ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్ర‌మ్లోనే ప్రభాస్ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పాన్ ఇండియా లెవెల్లో అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది అయితే ప్రభాస్ నుంచి డబ్బులు ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అన్న టాక్ నడుస్తుంది. ప్రభాస్ సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ప్రభాస్ అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకదాన్ని మించి మరో సినిమాపై ఇంట్రెస్ట్ నెలకొల్పుతున్నారు మేకర్స్. కల్కి 2, రాజాసాబ్, హ‌ను రాగవపూడి మూవీ, స్పిరిట్, సలార్ 2 సినిమాలు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉండగా.. వీటిలో తాజాగా క‌ల్కి 2 రిలీజ్ గురించి తాజాగా ప్రొడ్యూసర్ అశ్విని దత్ రియాక్ట్ అయ్యారు.

क्या Prabhas की 'द राजा साब' हो गई पोस्टपोन? नए पोस्टर ने उठाए सवाल – TV9  Bharatvarsh

ప్రభాస్ నాగ్ అశ్విన్‌ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి సీక్వెల్ గా కల్కి 2 రానుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూట్‌ను పూర్తిచేసిన టీం.. త్వరలోనే ఫుల్ ప్లజ్డ్‌ షూట్ స్టార్ట్ చేసి సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయనున్నట్లు అశ్వినీ దత్ వివరించారు. దీంతో పాటే.. ఈ రెండేళ్లలో ప్రభాస్ నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం గ్యారెంటీ అంటూ అభిమానులు భావిస్తున్నారు. 2025, 26లో ప్రభాస్ 4 సినిమాలు రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా రాజాసాబ్ సంక్రాంతి స్పెషల్ పాస్టర్లు రిలీజ్ చేశారు. ఇటీవల కాలంలో ఎప్పుడు లేనంత హ్యాండ్సమ్ గా ప్రభాస్ ఈ పోస్టర్లో మెరిసారు. అయితే ఈ పోస్టర్లో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోయినా.. ఈ ఏడాదిలోనే సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని సమాచారం. ఇక ఈ ఏడాదిలో ఆల్రెడీ రాజాసాబ్‌ రిలీజ్‌ ఫిక్స్ అయ్యింది. కాగా ఈ మూవీ తర్వాత స్పీడ్‌గా హ‌నురాగవ‌పూడి కాంబినేషన్ ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్‌తో మరో సినిమాను రూపొందించే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

Kalki 2898 AD beats Salaar in this aspect | cinejosh.com

 

పిరియాడికల్‌ యాక్షన్ డ్రామాగా సినిమా రూపొందనుందని.. ప్రభాస్ న‌యా లుక్‌లో కనిపించనున్నారు అని.. స్టోరీ కూడా కొత్తగా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో పూర్తిచేసి రిలీజ్ చేయాలని.. లేదా నెక్స్ట్ ఇయర్ ప్రారంభంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌ల‌తో ఉన్న ప్రభాస్‌కి సలార్‌తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ నీల్‌.. స‌లార్ సీక్వెల్ స‌లార్ 2 రూపొందించబోతున్నాడని.. తాజా అప్డేట్ వైరల్ గా మారుతుంది. ఆల్రెడీ సలార్‌లోనే.. హై వోల్టేజ్ ఆక్షన్ చూపించిన ప్రభాస్‌.. స‌లార్ 2లో నెవర్ బిఫోర్ రేంజ్ లో యాక్షన్‌ని చూపించబోతున్నారని సమాచారం.

Prabhas and Hanu's Film Set to Roll Cameras on This Date - Deets Inside |  Prabhas and Hanu's Film Set to Roll Cameras on This Date – Deets Inside

ఈ సినిమా కూడా.. వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ లో ఉన్నారట. ఇక గతంలో ప్రభాస్.. ఆదిపురుష్‌ సినిమా నటించిన సమయంలో సంవత్సరానికి రెండు సినిమాలతో రావడానికి ట్రై చేస్తానంటూ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో చెప్పినట్లే ఈ రెండేళ్లలో కల్కి2, సలార్ 2, రాజాసాబ్, హ‌నురాగవపూడి ఫౌజీ.. ఈ 4 సినిమాల రిలీజ్ టార్గెట్‌తో ప్ర‌భాస్ బరిలోకి దిగుతున్నాడు. అయితే అనుకున్నవన్నీ జరిగి ప్రభాస్ తన టార్గెట్ ను రీచ్ అవుతాడా.. లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ ప్రభాస్ అనుకున్నదే జరిగితే ఈ రెండేళ్ల ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం పండగే.