2025: మోస్ట్ అవైటెడ్ ఇండియ‌న్ సినిమాల లిస్ట్ ఇదే..

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఐఎండీబీ కస్టమర్లు ఆ పేజ్‌ను చూస్తునే ఉంటారు. ఈ క్ర‌మంలోనే కస్టమర్ల వ్యూస్ ఆధారంగా.. ఐఎండిబి సంస్థ 2025లో మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల లిస్ట్‌ను అనౌన్స్ చేసింది. సినిమాలు, టీవీ షోలు మరియు ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబికి 250 మిలియ‌న్‌ల‌కు పైగా నెలవారి సందర్శకులు ఉన్నారు. వారి వీక్షణలు, సెర్చింగ్ ఆధారంగా రూపొందించిన 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల లిస్టులో.. సికిందర్ నెంబర్ వన్ గా నిలిచింది. దీనిపై డైరెక్టర్ మురగదాస్ మాట్లాడుతూ.. 2025 ఐఎండిబి మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ సినిమాల లిస్టులో సికిందర్ మొదటి స్థానంలో నిలవడం తనకు చాలా సంతోషంగా ఉందని.. సల్మాన్ ఖాన్ తో కలిసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.

సల్మాన్ ఖాన్ శక్తి.. సినిమా పైన డెడికేషన్.. సినిమాను మాటల్లో వర్ణించలేని విధంగా చేశాయ‌ని.. అందుకు సహకరించిన సాజిద్ నదియా వాడ్‌లకు ధన్యవాదాలు అంటూ చెప్పకచ్చాడు. ఆయన సికిందర్‌లో ప్రతి సన్నివేశంతో చెరగని ముద్ర వేసేలా రూపొందించారని.. ప్రేక్షకులలో ఎప్పటికీ నిలిచిపోయేలా ప్రతి క్షణాన్ని డిజైన్ చేయడం కోసం మనస్పూర్తిగా టీమ్ అంతా పనిచేశామంటూ వెళ్లడించాడు. సికిందర్ త‌ర్వాత‌ 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల లిస్టులో టాక్సీక్‌, కూలీ, హౌస్ ఫుల్, బాగి 4, రాజాసాబ్, వార్ 2, ఎల్ 2.. ఎం పురాన్, దేవా, చావా, కన్నప్ప‌, రెట్రో, థ‌గ్ లైఫ్, 16.. సితారే జమీన్ పర్, థామా, కాంతారా.. ఏ లెజెండ్ చాప్టర్ 1, ఆల్ఫా, థండెల్ సినిమాలో నిలిచాయి.

Prabhas' most-awaited films The Raja Saab and Kannappa are set to hit  theaters in 2025 summer

ఇక లిస్టులో పేర్కొన్న అన్ని సినిమాలు 2025 రిలీజ్ కానున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్టులో స్థిరంగా నిలిచాయని.. ఐఎండిబి పేర్కొంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 250మిలియ‌న్‌ సందర్శకులు ఉన్న ఈ పేజ్ ద్వారా.. నిర్ణయించబడిన జాబితాలో ఉన్న ఈ 20 టైటిల్స్ లో.. 11 హిందీ సినిమాలు, 3 తమిళ్ సినిమాలు, 3 తెలుగు సినిమాలు, 2 కన్నడ సినిమాలు, ఒక‌ మలయాళ సినిమా ఉండడం విశేషం. ఇక ఐఎండిబి కస్టమర్లు అందుబాటులో ఉన్నప్పుడు.. అలర్ట్‌ను తీసుకోవడం కొరకు వాటిని.. మరియు ఇతర టైటిల్స్ ను తమ ఐఎమ్‌డిబి లిస్టులో జోడించే అవకాశం ఉందని.. 2025 మోస్ట్ ఇండియన్ సినిమాలు గా ప్రస్తుతం ఈ సినిమాలో నిలిచినట్లు ఐఎమ్‌డిబి సంస్థ‌ పేర్కొంది.

Thandel Eyeing A Safe Date | cinejosh.com