టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈమె గురించి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరీక్షలు అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినా తమిళ్ సినిమాలో హీరోయిన్గా ఎక్కువ నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తన చిన్నతనం నుంచే ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. తండ్రి రాజేష్ కూడా సినీ నటుడే అయినప్పటికీ.. చిన్నతనంలోనే అనారోగ్య కారణాలతో ఆయన మరణించడంతో.. కుటుంబ భారమంతా ఆమె పైనే పడింది. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తన సొంత టాలెంట్ తోనే సక్సెస్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. నటిగా అవకాశాల కోసం ఎంతో కాలం ఎదురు చూసింది. ఎన్నో కష్టాలు, అవమానాలు తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని తన నటనతో తమిళ హీరోయిన్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.
ఇక తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత తెలుగులోను హీరోయిన్గా అవకాశాన్ని కొట్టేసింది. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇక్కడ కూడా తన నటనతో ఆడియన్స్‌ను మెప్పించింది. ఈ సినిమా తర్వాత టక్ జగదీష్, వరల్డ్‌ఫేమస్ లవర్ లాంటి సినిమాల్లో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఐశ్వర్య నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయింది. వెంకటేష్ భార్యగా భాగ్యం రోల్‌లో నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో తన మాట తీరుతోను ఆడియన్స్‌ను ఫిదా చేసింది.
ఈ క్రమంలోనే అమ్మడికి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే కెరీర్ ప్రారంభంలో తమిళ్లో ఎక్కువ సినిమాలు నటించిన ఈ అమ్మడుకు.. ఆ సమయంలో చేదు అనుభవం కూడా ఉందని తెలుస్తుంది. తమిళ్ డైరెక్టర్ సినిమా అవకాశాలు ఎక్కువగా ఇస్తానని.. కానీ తాను చెప్పిన విధంగా చేయాలని బలవంతం చేశాడట. కమిట్మెంట్‌కి ఒప్పుకుంటేనే.. తను చెప్పిన విధంగా చేస్తేనే అవకాశాలు వస్తాయని.. లేదంటే సినిమాల్లో అవకాశాలు లేకుండా చేస్తానంటూ బెదిరించాడట. అయినా ఐశ్వర్య.. తన ఆఫర్‌కు ఒప్పుకోలేదట. తన సొంత టాలెంట్ తోనే సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అంటూ ఓ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ గా మారుతుంది.