టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా మూవీ గేమ్ ఛేంజర్ ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా కోసం చరణ్ ఏకంగా తన మూడేళ్ళ సమయాన్ని కేటాయించి మరి కష్టపడ్డారు. ఇక సినిమాకు దర్శకత్వం వహించిన శంకర్.. ఒకప్పుడు తిరుగులేని స్టార్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నా.. ప్రస్తుతం ఆయన పూర్తిగా ఫేమ్‌ని కోల్పోతూ వస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనూ చరణ్ శంకర్ పై నమ్మకంతో ఆయనకు అవకాశాన్ని ఇచ్చాడు. దిల్ రాజు కూడా భారీ మొత్తాన్ని వెచ్చించి మరి సినిమా కోసం కష్టపడ్డారు. సినిమాలోని ప్రతిఫేంలోనూ ఆయన పెట్టిన ప్రతి రూపాయి క్లియర్‌గా తెలుస్తుంది. కానీ.. సరైన రిజల్ట్ లేకుండా పోయింది. మేకింగ్ పై శంకర్ పెట్టిన శ్రద్ధ.. స్క్రీన్ ప్లే పై ఉండి ఉంటే ఈ సినిమా పై ఆడియన్స్‌కు ఉన్న అంచనాల రిత్యా ఇప్పటికీ రూ.1000 కోట్ల క్లబ్ లోకి చేరుకునేది అనడంలో అతిశయోక్తి లేదు.
సినిమాలో అనేక సన్నివేశాలు.. లాజిక్స్ లేకుండా ఆడియన్స్‌కి చాలా తేలికగా అర్థమయ్యేలా తెరకెక్కించారని.. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే అద్భుతంగా రూపొందించారు అంటూ.. దాన్ని కూడా చాలా తక్కువ అని అడుగుతా ముగించేసారని.. సెకండ్ హాఫ్‌లో ఎక్కువ శాతం ఫ్లాష్ బ్యాక్‌ని పెట్టి ఉంటే కచ్చితంగా మరో రంగస్థలంలా సినిమా రికార్డ్ క్రియేట్ చేసేదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిజల్ట్‌పై తాజాగా డైరెక్టర్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. విలేకరి ఆయనను ప్రశ్న అడుగుతూ.. గేమ్ ఛేంజర్ సినిమాకి చాలా నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. దానిపై మీ రియాక్షన్ ఏంటి అని అడగగా.. శంకర్ మాట్లాడుతూ నా దృష్టికి ఇప్పటివరకు కేవలం పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. వాస్తవానికి సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ నాకే సంతృప్తిని ఇవ్వలేదు. నాకు ప్రతి సినిమాలోనూ డిటేయిలింగ్ ఇవ్వడం అలవాటు.. అలాగే ఈ సినిమాకు డీటెయిల్స్ ఇచ్చానంటూ వివరించాడు.
ఐదు గంటల ఫుటేజ్ వచ్చింది. కనీసం మూడు గంటల ఫుటేజ్ అయినా ఉండాలని చెప్పా. కానీ.. దిల్ రాజు గారు మా తెలుగు సినిమాలు అంత పెద్దవి కూడా ఉండకూడదు సార్ అని చెప్పారని.. ఇక తప్పలేదు కుదించాను అంటూ చెప్పుకొచ్చాడు. శంకర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దాదాపు గంటకు పైగా ఉంటుందని.. సినిమాలో కేవలం అరగంట మాత్రమే చూపించండి అని.. ఈ ఎపిసోడ్‌ను మరో 20 నిమిషాలు పెంచి ఉంటే సినిమా రిజల్ట్ వేరే లెవెల్ లో ఉండేది అంటూ చెప్పకొచ్చాడు శంకర్. చరణ్ కి కచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చేదని.. అంత అద్భుతంగా నటించాడంటూ వివరించాడు. ఇక ఏదేమైనా నిర్మాత దిల్ రాజు చేసిన పొరపాటు వల్లే వెయ్యికోట్ల రాబట్టాల్సిన సినిమా రూ.200 కోట్లతో సరిపెట్టాల్సి వచ్చిందంటూ సమాచారం. ఇక పుష్ప 2 నడివి 3 గంటల 20 నిమిషాలు ఉన్న సంగతి తెలిసిందే. మొదటి ప్రేక్షకులు దాన్ని చూడడానికి ఆసక్తి చూపకపోయినా.. రిజల్ట్ పాజిటివ్ రావడంతో ఆ తర్వాత ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలోనే కలెక్షన్లతో ర్యాంపేజ్ ఆడింది. పుష్ప 2 గేమ్ ఛేంజర్ కూడా ఇదే ఫార్ములాను వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.