టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక పేరు చెప్పగానే విజయ్ దేవరకొండ పేరు టక్కున గుర్తుకు వచ్చేస్తుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే రష్మిక గుర్తుకొస్తుంది. తెలుగు ఆడియన్స్ లో ఈ పేయిర్ అంతలా నిలిచిపోయారు. వెడతెరపై వీళ్ళ కెమిస్ట్రీకి ఫిదా అవని ఆడియన్స్ ఉండరు. ఇక రియల్ లైఫ్ లోను వీరిద్దరూ ప్రేమాయణంలో ఉన్నారంటూ ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. వీరిద్దరూ ఎప్పుడెప్పుడు ఒకటవుతారు అంటూ వీళ్ళ ఫ్యాన్‌తో పాటు.. సినీ ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ జంట ఎన్నో ఇన్ డైరెక్ట్ హాంట్స్ ఇస్తూనే ఉన్నారు. కానీ.. లవ్ లో ఉన్నట్టు మాత్రం ఎప్పుడూ బయట పెట్టలేదు. ఇక విజయ్ దేవరకొండ తమ్ముడు.. ఆనంద్..రష్మికను ఎప్పుడూ వదినా అని పిలుస్తూ ఉంటాడు.
అంతేకాదు.. తాజాగా ఆమె దేవరకొండ ఫ్యామిలీతో కలిసి పుష్ప 2 సినిమాను థియేటర్లో చూసింది. ఇక ఈ జంట ఎప్పుడు విదేశాల్లో కలిసి తిరుగుతూ ఉంటారు. అలా ఇప్పటికే ఇద్దరు ఎన్నోసార్లు విమానాశ్రయాల్లో కలిసి మీడియా కంట చిక్కారు. ఇలాంటి క్రమంలో తాజాగా విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూలో రష్మిక ప్రస్తావన రాగా.. దానిపై రియాక్ట్ అయ్యాడు. విజయ్ మాట్లాడుతూ.. ఈ విషయం గురించి మంచి టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. ప్రేక్షకులంతా ఎప్పుడైతే దీని గురించి తెలుసుకోవాలని భావిస్తారో.. సరిగ్గా అదే టైంలో నేను ఓ విషయాన్ని వెల్లడిస్తా అంటూ చెప్పుకొచ్చాడు. తానే ఈ విషయాన్ని బయట పెడతాను అంటూ వెల్లడించాడు.
నేను సినిమా నటుడిని కావడంతో.. సాధారణంగానే తన పర్సనల్ లైఫ్, సినిమా లైఫ్ గురించి ఆసక్తి అందరిలోనూ ఉంటుందని.. ఈ విషయంలో నాపై వచ్చే వార్తలకు నేను ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అవ్వడం లేదని విజయ్ దేవరకొండ వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. మరోపక్క రష్మిక కూడా ఇటీవల ఓ సందర్భంగా రియాక్ట్ అవుతూ.. ఈ విషయం అందరికీ తెలుసు తాను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ కామెంట్లు చేసింది. ఈ క్రమంలోనే.. పరోక్షంగా రష్మికతో తన ప్రేమ గురించి త్వరలో ప్రకటిస్తానని విజయ్ చెప్పాడని.. ఇక నెక్స్ట్ పెళ్లి కాయమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.