జాతుషుడు వేణు స్వామి పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు, రాజకీయ నాయకులు జాతకాలు చెప్తూ.. పాపులారిటీ దక్కించుకున్న వేణు స్వామి.. ఎన్నోసార్లు జాతకాలు తప్పుగా చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొన్నాడు. ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూ వేణు స్వామి కొద్ది నెలల క్రితం సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అలా కామెంట్స్ చేసిన తర్వాత కూడా.. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధం పై జోక్యం చేసుకొని మరీ జాతకం చెప్పాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ వేణు స్వామి పై ఫైర్ అయ్యారు.
మరోవైపు జర్నలిస్టులు కూడా వేణు స్వామిపై మండిపడ్డారు. ఆయనపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఇక చిక్కుల్లో పడ్డ వేణు స్వామి.. కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నా.. ఇప్పుడు మరోసారి పలు యూట్యూబ్ ఛానల్‌లకు ఇంటర్వ్యూ లిస్తూ సందడి చేస్తున్నాడు. రీసెంట్‌గా కొన్ని యూట్యూబ్ ఛానలకు వేణు స్వామి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై రియాక్ట్ అయ్యాడు. అంతేకాదు.. తనపై విమర్శలు చేసినందుకే ఇండస్ట్రీ చిక్కుల్లో పడిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మనం వేణు స్వామిని గెలికినప్పటి నుంచే ఎందుకు ఇండస్ట్రీలో ఇలా కలకాలం మొదలైందని ఆలోచించుకోవాలని.. రేపు 2025 మార్చి నుంచి రాజకీయాల్లో పెను సంచలనాలు మొదలవుతాయి. ఇది కూడా ఆలోచించుకోండి అంటూ కామెంట్స్ చేశాడు.
తెలుగు ఇండస్ట్రీ గింగిరాలు తిరుగుతుంది అని నేను ఎప్పుడో ఓ ఇంటర్వ్యూలో చెప్పా. ఇలాంటి నాలుగు పెద్ద సంఘటనలు.. మీ లైఫ్ లో ఎప్పుడైనా చూశారా అంటూ ప్రశ్నించాడు. ఓ స్టార్ హీరో కన్వెన్షన్ కూల్చేయడం , అలాగే స్టార్ డైరెక్టర్ ను టార్చర్ చేయడం, పాన్ ఇండియా హీరోను జైల్లో పెట్టడం, 70 ఏళ్ల హిస్టరీ ఉన్న హీరో ఇంట్లో గొడవలు.. ఇవన్నీ ఎప్పుడైనా వచ్చాయా.. ఇదంతా నేను ఎప్పుడో ఆగస్టులోనే చెప్పా.. ఇంతే కాదు ఇంకా చాలా జరుగుతాయి అంటూ వేణు స్వామి వెల్లడించాడు. అల్లు అర్జున్ సీఎం అవుతాడు అంటూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. వేణు స్వామి చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.