పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో ఏర్పడిన తొక్కీసులాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె తనయుడు శ్రీ తేజ అనారోగ్య పరిస్థితులతో కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ లీగల్ కారణాలతో శ్రీ తేజను కలవడం కుదరడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ఇటీవల వెళ్లడించాడు.
తాజాగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ వెళ్లి కుటుంబాన్ని పరామర్శించాడు. డాక్టర్‌తో మాట్లాడి తర్వాత మీడియాతో ఆయన సంభాషించాడు. ఈరోజు ఆ మూవీ డైరెక్టర్ సుకుమార్ కూడా కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి కుటుంబాని కలిశాడు. శ్రీతేజను పరమర్శించిన అనంతరం అతని మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్‌ను కలిసి శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. కాగా.. సుకుమార్ భార్య గతంలోనే రేవతి భర్తను కలిసి రూ.5 లక్షల చెక్ అందించిందని తాజాగా రివిల్ అయింది.
ఇక లీగల్ వ్యవహారాలు పూర్తయిన వెంటనే.. అల్లు అర్జున్ కూడా శ్రీ తేజను పరామర్శించే అవకాశం ఉందట. ఇక బాలుడు అల్లు అర్జున్ వీరాభిమాని కావడంతో.. తండ్రి సినిమా టికెట్లు సంపాదించి సినిమాకు తీసుకెళ్లగా అనూహ్యంగా తొక్కిసులాటలో తల్లిని కోల్పోయాడు. ప్రస్తుతం ఆ బాలుడు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు.