టాలీవుడ్ హీరో అల్లరి నరేష్.. మొదట కామెడీ హీరోగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నాంది సినిమా నుంచి తన కంటెంట్ సెలక్షన్ మార్చుకున్నారు. సీరియస్ కథలపై దృష్టి సారిస్తున్న అల్లరి నరేష్ ప్రస్తుతం అలాంటి సినిమాలలోనే తనను తాను కొత్తగా ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. కొన్ని సినిమాల సక్సెస్ అందుకుంటే మరికొన్ని పక్కదారి పడుతున్నాయి. అయితే నటుడిగా నరేష్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా నరేష్ నటించిన రోల్ బచ్చలపల్లి. మూర్ఖత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే క్యారెక్టర్‌లో నరేష్ ఈ సినిమా నటించాడు. ఈ సినిమా ఓ సరికొత్త ప్రయత్నం అని ఇప్పటివరకు వచ్చిన టైటిల్, టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఆడియన్స్ కు క్లారిటీ వస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో.. ప్రేక్షకులను నరేష్ మెప్పించాడో.. లేదో.. ఒకసారి చూద్దాం.
కథ
బచ్చలమల్లి (నరేష్) తనకు తండ్రి అంటే చాలా ఇష్టం. ఇక తండ్రికి కూడా కొడుకులంటే ప్రేమ. అయితే రెండో పెళ్లి చేసుకుని తల్లికి అన్యాయం చేశాడనే కోపంతో తండ్రిపై కోపాన్ని పెంచేసుకుంటాడు మల్లీ. ఆ కోపం పగగా మారడం.. ఈ క్రమంలోనే చదువు మానేసి.. లైఫ్ స్పాయిల్ చేసుకోవడం.. మద్యం, పొగ తాగడం ఇతరేతర చెడు అలవాట్లన్నీ అలవర్చుకుంటాడు. లేని చెడు అలవాటు ఉండదు. అన్నింటికీ మించి లిమిట్స్ లేని మూర్ఖత్వం. ఇలాంటి క్రమంలో మల్లీ.. కావేరి (అమృత అయ్యర్)ని ప్రేమిస్తాడు. తన కోసం చెడు అలవాట్లు మార్చుకొని జీవితాన్ని చక్కగా మలుచుకుంటున్నాడు అనుకునే టైంలో మళ్లీ మూర్ఖత్వం మొదలైంది. దానికి కారణం ఏంటి.. మల్లీ మరోసారి తప్పుడు దారి పట్టడా.. అసలు మళ్లీ జీవితం చేజేతులారా ఎలా నాశనం చేసుకున్నాడు.. అనేది అసలు కథ.
విశ్లేషణ:
లైఫ్ అంటే కొన్ని చోట్ల పట్టు, విడుపు తప్పవు. అనుబంధాలు నిలవాలంటే కోపాలు, ప్రతీకారాలు పక్కన పెట్టేయాలి.. లేదంటే వంటరితనమే మిగిలిపోతుంది అనడానికి బచ్చలి మళ్లీ జీవితమే సరైన ఉదాహరణ అనేట్లుగా కథను రూపొందించారు. ఇక సినిమా ఓ క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. ప్రతి సీన్లో బచ్చలపల్లి క్యారెట్రైజేషన్ ఉండాల్సిందే. ఈ క్రమంలోనే అసలు కథ ఏంటనేది ప్రశ్నగా మారిపోయింది. ప్రతి సీన్‌లో హీరో క్యారెక్టర్రైజేషన్‌ను చూపించాడు దర్శకుడు. తన కోపం, పంతం, మూర్ఖత్వం ఇలా ప్రతి ఫ్రేమ్‌లోను బచ్చల మల్లి కనిపిస్తాడు. అతని చిన్నతనం, తండ్రి పై కోపం, లైఫ్ స్పాయిల్ చేసుకోవడం ఎలా ప్రతి సీన్లు పేర్చుకుంటూ వెళ్లిపోయాడు డైరెక్టర్. అయితే లవ్ స్టోరీ వచ్చాక కాస్త కథ ట్రాక్‌లో పడినా.. స్టోరీ రెగ్యులర్ గా ఉంది. ఇక సినిమా చూసి ఆడియన్స్ కు ఓ మూర్ఖున్ని.. ఆ అమ్మాయి అంత సింపుల్ గా ఎలా ప్రేమించేసింది అనే సందేహాలు వస్తాయి.
అయితే ఆమె చెడు అలవాట్లు మానేయమనగానే వెంటనే మల్లీ లో వచ్చే మార్పు కూడా ఓవర్గా అనిపిస్తుంది. మూర్ఖంగా ఎందుకు మారాలి.. ఎవరి కోసం మారాలి.. అనే ఒక క్యారెక్టర్.. అమ్మాయి కోసం, తన ప్రేమ కోసం ఇట్టే మారిపోవడం అది కూడా మల్లిగాడు క్యారెక్టర్ అసలు సూట్ కాలేనిపిస్తేంది. ఇక చివరిలో తల్లి చెప్పే మాటలకు ఇట్టే కన్విన్స్ అయిపోయి.. వెంటనే మల్లిలో మార్పువచ్చేస్తుంది. ఈ క్రమంలోనే ఆడియన్స్ ఆ లెక్చరర్ ముందే ఇస్తే ఎంత గొడవ ఉండదుగా అనే ఫీల్ వస్తుంది. తండ్రీతో.. కొడుకుకు పగా అనే కాన్సెప్ట్ బాగున్నా.. కథను మరింత బలంగా రాసి ఉంటే బాగుండేది అనిపించింది. తండ్రి పాత్ర చాలా సాఫ్ట్ గా ఉండడం.. హీరో ఆ క్యారెక్టర్ పై పగ పెంచుకోవడం.. ప్రేక్షకుల్లో హీరో రోల్ పై నెగెటివిటీ తీసుకొస్తుంది.
అలాంటి క్రమంలో కథలో కీలకమైన కాన్సెప్ట్ ఆడియన్స్ అసలు కలెక్ట్ కారు. ఇక లవ్ స్టోరీ లో విలన్ దగ్గర బలమైన సంఘర్షణ ఉండదు. అసలు ఈ కథలో విలన్ ఎందుకు ఉన్నాడో.. ఏం చేస్తున్నాడో.. అర్థం కాని పరిస్థితి. మూర్ఖత్వం బోర్డర్ దాటిన హీరో కథ మాత్రమే కనిపిస్తుంది. ఒక్కోసారి అతని మూర్ఖత్వమే కొంప ముంచిందన్న ఫీల్ వస్తుంది. హీరో పట్ల ఇష్టం పోయి.. కోపం ఏర్పడేలా క్యారెక్టర్ ఉంటుంది. అది ఏ సినిమా కైనా నష్టమే. ఇప్పుడు బచ్చలమల్లికి అదే పరిస్థితి ఎదురైంది. కొన్నిచోట్ల డైరెక్టర్ సీన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. పెళ్లి మండపం సీన్ నుంచి ఎమోషన్స్ మొదలు. రావు రమేష్ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లడం, ఫ్రీ క్లైమాక్స్, రావు రమేష్ తో జరిగే సంభాషణ డైరెక్టర్ బాగా రాసుకున్నట్లు అనిపించింది.
క్లైమాక్స్ కదిలించింది. చిన్నాన్న అనే బాండ్ చుట్టూ తీసిన సీన్స్ ఆకట్టుకున్నాయి. ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ హరితేజ తలపై చేయి వేసి.. మ్లీ ఆశీర్వదించే సీన్ మెప్పిస్తుంది. కానీ.. సినిమాకు ఇది సరిపోదనిపించింది. ఓ దశలో హీరో క్యారెక్టర్‌పై ఆడియన్స్‌కు విపరీతమైన కోపం వస్తుంది. అలాంటప్పుడు క్లైమాక్స్ ఎంత బలమైన ఎమోషన్‌తో ఉన్నా ఆడియన్స్‌కు అది హార్ట్ టచ్ చేయలేదు. ఇక నరేష్ కెరీర్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్. మొదట నుంచి చివరి వరకు క్యారెక్టర్ లో జీవించేసాడు. ఇక ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో టాప్ 3 పర్ఫామెన్స్ లిస్ట్ లోకి బచ్చలమల్లీ ఖచ్చితంగా ఉంటుంది. సినిమాలో మల్లీ తప్ప.. మరే క్యారెక్టర్ మనకు రిజిస్టర్ కాదు. ఆఖరికి హీరోయిన్ పాత్ర కూడా. అంతలా సినిమాను నరేష్ జీవించాడు.
అమృతా అయ్యర్ ట్రెడిషనల్ గా, రావు రమేష్ తనదైన స్టైల్ తో నటించి ఆకట్టుకున్నారు. ప్రవీణ్ కి చాలా కాలం తర్వాత ఓ వెరైటీ రోల్ పడింది. ఇక ఈ సినిమాల్లో ప్రసాద్ బెహర చిన్న క్యారెక్టర్ లో నటించాడు. వైవా హర్ష అతనిని ఉద్దేశిస్తూ పంచలేసిన డైలాగ్స్ ఆడియన్స్ లో విపరీతంగా పేలాయి. తాజాగా ప్రసాద్ బెహరా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఈ డైలాగ్స్ రిలేటివ్గా ఆడియన్స్‌కు అనిపించి ఉండవచ్చు. ఇక అత్యుత్ కుమార్ పాత్రని చాలా పవర్ ఫుల్ గా చూపించినా కథకు తగ్గట్టు వాడుకోలేదన్న ఫీల్ వస్తుంది. టెక్నికల్ గా ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సాంగ్స్ గుడ్. పూర్ణాచారి రాసిన ఎమోషనల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మెప్పిస్తాయి. డైరెక్ట్ సుబ్బు.. కథ కంటే క్యారెక్టర్‌పై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపిస్తుంది. అయితే ఇందులో బలమైన సంఘర్షణ లేకపోవడం.. ఆడియన్స్‌కు నిరాశ మిగులుస్తుంది. రెండున్నర గంటల సినిమా చూద్దామని వచ్చిన ప్రేక్షకుడికి.. బచ్చలపల్లి పూర్తిస్థాయిలో సంతృప్తి పరచలేదనిపిస్తుంది.
రైటింగ్ : 2:50/5