ఉపేంద్ర UI సినిమాపై ఇంట్ర‌స్టింగ్ ప్ర‌చారం… వ‌ర‌ల్డ్ సినిమా హిస్ట‌రీలోనే ఫ‌స్ట్ టైం కొత్త పుకారు..!

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘యూఐ’ ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజ‌ర్లు, ట్రైల‌ర్లు ఆస‌క్తిగా ఉండ‌డంతో సినిమా ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని అభిమానులు ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఇక ఉపేంద్ర గ‌త సినిమాల్లాగానే యూఐ కూడా డిఫరెంట్‌గా ఉండబోతోందని ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు చెప్పేశాయి. అయితే ఇప్పుడు ‘యూఐ’ సినిమా గురించి వ‌చ్చిన ఒక రూమ‌ర్ ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఏ సినిమాకు రాని రూమ‌ర్ వ‌చ్చింది.

సాధార‌ణంగా ఏ సినిమా గురించి ఈ టైప్ చ‌ర్చ జ‌ర‌గ‌దు. యూఐ సినిమా క్లైమాక్స్‌పై స‌రికొత్త రూమ‌ర్ వ‌చ్చింది. ఈ సినిమాకు ఒక‌టి కాదు ఏకంగా రెండు క్లైమాక్స్‌లు ఉంటాయ‌ట‌. ఒక్కో థియేట‌ర్లో ఒక్కో క్లైమాక్స్ ప్ర‌ద‌ర్శిస్తార‌ని.. అందుకే ప్ర‌తి ఒక్క‌రు రెండుసార్లు సినిమా చూడాల‌న్న స‌రికొత్త ప్ర‌చారం న‌డిచింది. దీనిపై ఉపేంద్ర క్లారిటీ ఇచ్చారు. డిఫ‌రెంట్ క్లైమాక్స్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తారంటూ పుకారు పుట్టింది.

స‌హ‌జంగానే ఉపేంద్ర సినిమాలు డిఫ‌రెంట్‌గా ఉంటాయి.. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు కూడ రెండు క్లైమాక్స్‌లు ఉంటాయ‌నే అంద‌రూ అనుకున్నారు. దీనిపై ఉపేంద్ర క్లారిటీ ఇచ్చి స‌స్పెన్స్‌కు తెర‌దించారు. యూఏ సినిమాకు ఒక్క క్లైమాక్సే ఉంటుంద‌ని చెప్పారు. అయితే సినిమాలో కంటెంట్ మ్యాజిక్ అద్భుతంగా ఉంటుంద‌ని.. ప్ర‌తి ఒక్క‌రు రెండుసార్లు సినిమా చూడాల‌నిపిస్తుంద‌న్నారు.

చాలా యేళ్ల త‌ర్వాత ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యూఐ’ చిత్రంలో రీష్మా నానయ్య, ఇంద్రజిత్ లంకేష్ తదితరులు నటించారు. లహరి ఫిల్మ్స్‌ అండ్‌ వెనుస్‌ ఎంటర్‌టైనర్స్‌ బ్యానర్లపై జి. మనోహరన్, కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కానుంది.