నందమూరి నటసింహం బాలకృష్ణ.. తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ బాధ్యతలు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సినిమాను కూడా ప్రారంభించాడు ప్రశాంత్ వర్మ. అయితే రేపటి రోజున.. ఈ సినిమా ముహూర్తం అన్న సమయానికి మోక్షజ్ఞ హెల్త్ బాగోకపోవడంతో సినిమా ఓపెన్ కార్యక్రమం కూడా ఆగిపోయిందంటూ వార్తలు వినిపించాయి. దీంతో.. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ వార్తలు తెగ వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేశారు. అయితే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ.. ఇంకా సినిమాలు చేసేందుకు సిద్ధంగా లేడని.. తండ్రి బలవంతంపై సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు అంటూ ఓ పుకారు కూడా వైరల్ గా మారింది.
మోక్షజ్ఞ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారని.. చివరి నిమిషంలో సినిమా ఆగిపోయిందంటూ రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ సినిమా రూమర్లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సినిమాకు సంబంధించి ఆధారం లేని రూమర్స్ ఎన్నో వైరల్ గా మారుతున్నాయని.. అందులో ఏమాత్రం నిజం లేదంటూ వెల్లడించిన టీం.. సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా కేవలం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ లాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మాత్రమే తెలియజేస్తామంటూ వెల్లడించింది.
అప్పటివరకు ఎలాంటి వార్తలు మీడియా నుంచి వచ్చిన.. మూవీ టీంకు, సినిమాకి ఎలాంటి సంబంధం ఉండదంటూ వెల్లడించింది. అభిమానులు ఎవరు ఈ తప్పుడు రూమర్స్ ను నమ్మవద్దని.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టీం వెల్లడించారు. మొత్తానికి ఈ సినిమా ఆగిపోతుంది అంటూ వచ్చిన రూమర్లకు క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కు సంబంధించిన రెండు లుక్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వస్తుందా.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ ఖయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.