ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి.. సక్సెస్ సాధించిన తర్వాత కూడా ఎంతో మంది ఏవో కరణాలతో హఠాతుగా మాయమౌతూ ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్ ఒకటి. ఈ పేరు చెప్తే గుర్తుకు రాకపోవచ్చు కళ్యాణ్ రామ్ కత్తి మూవీ హీరోయిన్ అంటే టక్కున గుర్తుకొస్తుంది. ఈ ఇనిమాతో పాగు.. నాగార్జున గగనం, మంచు మనోజ్ మిస్టర్ నూకయ్య లాంటి తెలుగులో సినిమాలు నటించి ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. 2019లో దుబాయ్ కి చెందిన ముస్లిం మత గురువు.. బిజినెస్ మ్యాన్ అయిన ముఫ్తి అనస్ సయ్యద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
తర్వాత దుబాయ్ కి వెళ్లి అక్కడే సెటిలైపోయిన సనా ఖాన్, సయ్యద్ దంపతులకు 2023లో.. పండంటి ఆడబిడ్డ పుట్టింది. అయితే తాజాగా మరోసారి ఈ ముద్దుగుమ్మ తల్లి కానుంది. కొద్దిరోజుల క్రితం ఈ విషయాన్ని స్వయంగా అభిమానులతో షేర్ చేసుకుంది. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సనా.. ఇటీవల సోషల్ మీడియా వేదికగా తన ప్రెగ్నెన్సీ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే.. ఓ వీడియోలో సనా మాట్లాడుతూ.. ఐదు నుంచి పదిమంది పిల్లలునైనా కనాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ కామెంట్స్ చేసింది. అంతేకాదు పోస్ట్ పార్టం డిప్రెషన్స్‌పై తన అభిప్రాయాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవ్వడంతో దీనిపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. సనా ఆ వీడియోలో మాట్లాడుతూ.. నేను ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వలనుకుంటున్న అంటూ చెప్పుకొచ్చింది.
ఆ సంఖ్య ఐదు నుంచి పది కావచ్చు. పూర్వకాలంలో మహిళలు డజన్ మంది పిల్లలను కన్నేవారట. నేను గర్భం ధరించినప్పటి నుంచి నా భర్త నన్ను చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. బిడ్డ ప్రసవించే వరకు కంటికి రెప్పలా నా వెంటే ఉంటున్నారు.. ఇక పోస్ట్ పార్టం నుంచి బయటపడాలంటే.. ఆధ్యాత్మికతవైపు మళ్ళీ ఎందుకు ప్రయత్నిప్తే బాగుంటుందంటూ సలహా ఇచ్చింది. తన కామెంట్స్ పై జనం ఫైర్ అవుతూ.. 10 నుంచి 12 మంది పిల్లలకు జన్మనివ్వడం అంటే సాధారణ విషయమే కాదు.. పనిచేయడానికి నానీలు, పనిమనిషిలో ఉన్నప్పుడు మీరు ఈ విషయాన్ని చెప్పడం చాలా ఈజీ అంటూ.. మరి కొంతమంది ఇంత జనాభా ఉన్న భారత్లో 10, 12 మందిని కన్నడం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడాలి అంటూ ఆమెపై మండిపడుతున్నారు.