గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికి ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు కథ అందించారు. కాగా చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ ప్లే చేస్తుండటంతో సినిమాపై ఫ్యాన్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్ కి చేరుకున్నాయి. ఏకంగా రెండు గంటల యాభై నిమిషాలు నడివితో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఇక.. ఇప్పటివరకు చరణ్‌ను ఆడియన్స్.. ఎలాంటి రోల్‌లో చూడాలనుకుంటున్నారో అదే విధంగా గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడట. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు హైలెట్గా ఉండనున్నాయని టాక్ నడుస్తోంది. ఈ రెండు సన్నివేశాలకు ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ రావడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం హైలెట్ గా ఉండనున్నాయట. ఇక ఈ సినిమాలో.. హీరోయిన్‌గా కియార ఆధ్వని నటిస్తుంది.
ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ నటనతో ఆడియన్స్‌ను మెప్పించడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమాకు టాలీవుడ్ లో ఉన్న హైప్ రిత్యా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. ఇతర భాషలో సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి. సాధారణంగా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు.. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి క్రమంలో గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా లెవెల్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజై.. ఎలాంటి మ్యాజిక్ వర్కౌట్ చేస్తుందో.. సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.