టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ చివరిగా కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించిన నాగ అశ్విన్‌కు పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే.. నాగ అశ్విన్, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కాంబోలో సినిమా సెట్ అవ్వనుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ డబ్యూ మూవీ వీరిద్దరి కాంబోలో తరికెక్కనుందని.. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్‌తో మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ క్రమంలోనే నాగ అశ్విన్‌తో మోక్షజ్ఞ మరో సినిమా నటిస్తాడంటూ వార్తలు వైరల్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఇక నాగ అశ్విన్ టాలీవుడ్‌లో ఇప్పటివరకు తీసినది అతి తక్కువ సినిమాలైనా.. తను తీసిన ప్రతి సినిమాతో ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక చివరిగా వచ్చిన ప్రభాస్ కల్కి బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ పై పీక్స్ లెవెల్ లో అంచనాలను నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం కల్కి సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్న అశ్విన్.. సినిమా రిలీజ్ చేయడానికి నాలుగు సంవత్సరాల వరకు సమయం తీసుకోనున్నాడట. ఈ క్రమంలోనే మోక్షకుతో ఓ సినిమా తీయాలని అశ్విన్ భావించినా.. మోక్షజ్ఞ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని సమాచారం.
అంతేకాదు మోక్షజ్ఞ, వెంకీ అట్టూరి కాంబోలో కూడా ఓ సినిమా రానుందంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే.. మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్ విషయంలో గందరగోళం నెలకొంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మోక్షజ్ఞ మొదటి నుంచి మీడియాకు దూరంగా ఉండటంతో.. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. అయితే.. నాగ అశ్విన్ డైరెక్షన్‌లో నిజంగానే మోక్షజ్ఞ సినిమా వస్తే మాత్రం.. కచ్చితంగా ఫ్యాన్స్‌కు పండుగే అనడంలో అతిశయోక్తి లేదు. వీరిద్దరి కాంబోలో నిజంగానే ఫీచర్లో సినిమా రానుందా.. లేదా ఇవన్నీ పుకార్లా తెలాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.