టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.. మరికొద్ది గంటల్లో థియేటర్స్‌లో సందడి చేయనుంది. అల్లు అర్జున్, సుక్కుమార్ కాంబోలో రూపొందిన పుష్ప ది రూల్ సినిమాతో పుష్పరాజ్ మరోసారి తన సత్తా చాట్టేందుకు సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 4.. రాత్రి 9:30 నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా బుక్ మై షోలో టికెట్ బుకింగ్ ఓపెన్ అయింది. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే.. హాట్ కేకులా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ క్రమంలోనే పుష్పరాజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బాక్సాఫీస్ దగ్గర అత్యంత వేగంగా వన్ మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాగా పుష్ప 2 రికార్డ్ సృష్టించింది.
కేవలం బుక్ మై షో లోనే.. వన్ మిలియన్ టికెట్స్ అమ్ముడుపోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఓవర్సీస్‌లో ఈ సినిమా ప్రీ బుకింగ్స్‌తో ఇప్పటికే హవ కొనసాగిస్తుంది. ఇటీవల హిందీ వర్షన్ టికెట్స్ ఓపెన్ చేయగా 24 గంటల్లో లక్ష టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. బాలీవుడ్ ఆల్ టైం టాప్ సినిమాల లిస్టులో ఈ సినిమా మూడో స్థానాన్ని దక్కించుకుంది. తెలుగు సినిమాకు బాలీవుడ్‌లో ఈ రేంజ్ సక్సెస్ రావడమంటే అది సాధారణ విషయం కాదు. రిలీజ్‌కు ముందు.. ఇన్ని రికార్డులు సృష్టించిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత ఇంతకుమించిన బ్లాక్‌బస్టర్ రికార్డులు సొంతం చేసుకోవడం ఖాయం అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లలో.. ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ బాహుబలి సక్సస్‌కు మనం గర్వించాం. ఇది మా సినిమా మా అందరి స్థాయిని పెంచిందని అనుకున్నాం. ఆర్‌ఆర్ఆర్ తర్వాత అంతర్జాతీయ స్థాయి పేరు రావడం ఆనందాన్ని కల్పించింది. తెలుగు వారికి మళ్లీ అదే రేంజ్ లో పేరు తీసుకురావాలని ఓ తపనతో, ప్రేమతో, భక్తితో పుష్ప సినిమాను చేసాం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇక ఈ సినిమా మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే పుష్ప 2.. రూ.2000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.