మళ్లీ దేవరకొండను కెలికిన అనసూయ.. రష్మికకు ఇన్ డైరెక్ట్ వార్నింగ్..

టాలీవుడ్ పాపుల‌ర్ ఫిమేల్ యాంకర్లలో అనసూయ కూడా ఒకటి. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య జరుగుతున్న వివాదం ఓపెన్ కాంట్రవర్సీనే. ఎప్పటికప్పుడు అనసూయ.. విజయ్ దేవరకొండపై పరోక్షంగా సంచలన ట్విట్లు చేస్తూ వివాదాలు రేపుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే విజ‌య్ ఫ్యాన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అర్జున్ రెడ్డి మూవీ నుంచి అనసూయ.. విజయ్ మధ్యన వార్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇటీవల ఈ వివాదం ముగిసింది అని అంతా భావించారు. కానీ.. మరోసారి అనసూయ, విజయ్ దేవరకొండ ను గెలికిందంటూ.. ఆమె చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్‌గా మారుతుంది.

Rashmika Mandanna Speech @ Pushpa 2 Pre Release Event | Hyderabad | Allu  Arjun | Manastars

విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూనే ఆ ట్విట్‌ చేసిందని.. కావాలనే అనసూయ, రష్మికకు ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అనసూయ తాజాగా త‌న ఇన్‌స్టా వేదిక‌గా దూరపు కొండలు నునుపు అనే సామెతను వైరల్ చేసింది. ఈ సామెతలో.. కొండ అనే ప‌దాని హైలెట్ చేస్తూ.. విజయ్ దేవరకొండ గురించి ఆమె ఇన్‌డైరెక్ట్‌గా అలాంటి నెగటివ్ కామెంట్స్ చేసిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ గా ప్రకటించకపోయిన ఇదే నిజం అంటూ ఇన్ డైరెక్ట్ గా రష్మిక చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్లో హింట్ ఇచ్చేసింది. ఇక తాజాగా జరిగిన పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మరోసారి మంచి జోష్ తో ప్రసంగం ఇచ్చింది.

రష్మిక స్పీచ్ విధానం విజయ్ దేవరకొండ స్టైల్ లో ఉందంటూ నెటిస‌న్లు అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి వచ్చిన రష్మిక.. దేవరకొండ తో ప్రేమలో పడిందని.. దీనిపై అనసూయ సేటైరికల్ గా చిన్నపాటి వార్నింగ్ ఇచ్చిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దూరపు కొండలు నునుపు అనే సామెతను మోసపోకుండా హెచ్చరించేందుకు వాడుతారని.. విజయ్ దేవరకొండ ప్రేమ మాయలో రష్మిక అలానే పడిపోతుందంటూ.. అనసూయ ఇన్ డైరెక్ట్ గా ఆమెకు వార్నింగ్ ఇచ్చిందని నెటిజ‌న్స్‌ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఆ ట్వీట్ వెనక కారణమేంటో.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అనసూయకే తెలియాలి.