టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా మూవీ పుష్ప 2. పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ ఎవైటెడ్ సినిమాగా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే కనివిని ఎరుగని రేంజ్‌లో హైప్ నె8లకొంది. ఇక పుష్ప 2 రిలీజ్‌కు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే పుష్ప 2 ప్రీ బుకింగ్స్ ఓపెనై రికార్డులు సృష్టిస్తుంది. టికెట్లు హార్ట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కాస్ట్ తో సంబంధం లేకుండా టికెట్ దొరికితే చాలు అన్నట్లుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంత సినిమా కోసం సినిమా చూడడానికి తెగ ఆరాట పడిపోతున్నారు.
ఈ క్రమంలోనే పుష్ప 2 ఫస్ట్ డే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళను కొల్లగొడుతుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప పార్ట్ 1 ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 వంతు వచ్చేసింది. ఈ నేపథ్యంలో పుష్ప ది రూల్ నేషనల్ లెవెల్‌లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కాగా.. ఈ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ 3 ఉండనుందని రష్మిక మందన ఇండైరెక్ట్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు తాజాగా హైదరాబాద్లో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ కూడా దీనిపై ఇన్ డైరెక్ట్ కామెంట్ చేశారు. మీ హీరో మరో రెండు సంవత్సరాలు టైం ఇస్తే.. పుష్ప 3 కూడా చేస్తా అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం సుకుమార్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే పుష్ప పార్ట్ 3 టైటిల్ ఇదే అంటూ టైటిల్ తెగ వైరల్ గా మారుతుంది. పుష్ప 1 కు.. పుష్ప ది రైజ్ అనే టైటిల్‌తో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ క్రమంలోనే పుష్ప స్పీక్వెల్.. పుష్ప ది రూల్ టైటిల్తో రూపొందించారు. ఇక సినిమా రిలీజ్ రిలీజ్ అయిన కొంతకాలం గ్యాప్ తర్వాత పుష్ప 3 సెట్స్ పైకి రానుందని.. దీనికి పుష్పాది ర్యాంపేజ్ అనే టైటిల్ పెట్టారంటూ ఓ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. పుష్ప 2 టైటిల్ ఎండ్ కార్డు టైంలో పుష్ప 3.. దీ రాంపేజ్ అనే పోస్టర్ ను రివిల్ చేస్తారని వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఎడిటింగ్ రూమ్లో దిగిన ఫోటోలు చిత్ర యూనిట్ షేర్ చేయగా.. అందులో వెనుకాల పుష్ప 3 పోస్టర్ ఉండడం అందరికీ ఆనందాన్ని కల్పిస్తుంది. అయితే పుష్ప 3 టైటిల్ ఇదేనా.. కాదా.. అసలు పుష్ప 3 వస్తుందా.. లేదా.. అనే దానిపై త్వరలోనే ఫుల్ క్లారిటీ రానుంది.