ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ హీరోయిన్గా మెప్పించిన శ్రద్ధ ఆర్య.. తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుని ఆనందాని పంచుకుంది. నవంబర్ 29న తనకు డెలివరి జరిగిన విషయాన్ని తెలియజేస్తూ.. తనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారని చెప్పుకొచ్చింది. ఇక తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, పంజాబీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. మొదట 2004లో టీవీ రియాలిటీ షోలో పాల్గొంది.
2006లో కలవనిన్ కథలై అనే తమిళ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక లాంటి సినిమాల్లో నటించింది. ఈ సినిమాలేవి సరైన సక్సస్ అందుకోలేదు దీంతో టాలీవుడ్‌కు దూరమైన శ్రద్ధ.. కొంత కాలం గ్యాప్ తర్వాత.. బాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకుంది. గత ఏడాది రిలీజ్ అయినా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని సినిమాలో గెస్ట్ రోల్ లో మెరిసింది.
వీటితో పాటు పలు సీరియల్స్ లోనూ ఆకట్టుకుంది. ఇక 2021లో నేవీ ఆఫీసర్ రాహుల్ నగాల్‌ని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన శ్రద్ధ.. ఈ ఏడది అక్టోబర్‌లో తన ప్రెగ్నెన్సీ వార్తను అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది. ఇప్పుడు తనకు ఓ అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కవలలు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వారి పిక్స్ వైరల్గా మారుతున్నాయి.