వెనకడుగు వేసిన ” డాకు మహారాజ్ “.. బాబి పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..

టాలీవుడ్ నందమూరి నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న బాలయ్య.. ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో పాటు అఖండ 2కు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో వస్తున్న డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో రిలీజ్ అవ‌నుంది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటివరకు డాకు మహారాజుకు సంబంధించి మరే అప్డేట్ మేకర్స్ షేర్ చేసుకోలేదు. కనీసం ప్రమోషన్స్ కూడా ప్రారంభించలేదు. కాగా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. బ్యాలెన్స్ షూటింగ్ ఈ నెల‌ మూడో వారంలో పూర్తవుతుందని సమాచారం.

Balayya Daku Maharaj Movie: బాలయ్య కొత్త సినిమా టీజర్ రిలీజ్.. 'డాకు  మహారాజ్'గా ఆధరగొట్టేశాడుగా! – News18 తెలుగు

కానీ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం డాకు మహారాజ్‌ వెనకడుగు వేస్తున్నాడు అంటూ.. సంక్రాంతి వార్‌లో రిలీజ్ కానున్న గేమ్ ఛేంజ‌ర్‌, సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాల అప్డేట్స్.. మేకర్స్ ఎప్పటికప్పుడు వ‌రుస‌గా అందిస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తుంటే.. బాలయ్య, డాకు మహారాజు విషయంలో మాత్రం బాబి వెనకడుగు వేస్తూనే ఉన్నాడని.. ఒక అప్డేట్ కూడా ఇవ్వడం లేదంటూ బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సంక్రాంతికి చరణ్ – శంకర్ కాంబోలో వ‌స్తున గేమ్ ఛేంజ‌ర్ నుంచి ఇప్పటికే మూడు పాటలతో పాటు, టీజర్ కూడా రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక అనీల్ రావిపూడి – వెంక‌టేష్ సంక్రాంతికి వస్తున్నాం గురించి రెగ్యులర్ మీడియాలో ఎక్కడోచోట ప్రెస్మీట్లో జరుగుతూనే ఉన్నాయి.

Sankranthiki Vasthunam is set to release with four day gap from Game Changer  during Sankranthi 2025 | Sankranthiki Vasthunam Vs Game Changer:  సంక్రాంతికి వస్తున్న వెంకీ మామ... 'గేమ్ చేంజర్'తో ఇష్యూ ...

అనిల్ ఏదో విధంగా జనాల్లో హైప్‌ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ మాత్రం అసలు మొదలు కూడా పెట్టలేదు. ఇటీవల టైటిల్, టీజ‌ర్‌ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి నుంచైనా డాకు మహారాజ్ కు ప్రమోషన్స్ పెంచాలని.. సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ అందించాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. ఇంకా డాకు మహారాజ్ ప్రమోషన్స్ చేయకపోతే.. సంక్రాంతి బరిలో వెనుక పడే అవకాశం ఉందని.. ప్రమోషన్స్ గట్టిగా ఉంటేనే సినిమా రిజల్ట్ పై దాని ప్రభావం ఉంటుందని.. బాబి ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గతేడాది సంక్రాంతి బరిలో వచ్చిన బాలయ్య సినిమాతో పాటు అన్ని సినిమాలు బ్లాక్ బ‌స్టర్లుగా నిలిచి మంచి రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే ఈసారి సంక్రాంతి బరిలో వస్తున్న అన్ని సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో వేచి చూడాలి.