పాన్ ఇండియా సూపర్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకునే రోజు వచ్చేసింది. మరో కొద్ది గంటలో పుష్ప రాజ్ మాస్ జాతర మొదలు కానుంది. ఎప్పటి నుంచో బన్నీ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పుష్ప 2 సినిమా ఈ రోజు పాయంత్రం 9:30నుంచి ప్రీమియర్లు పడనున్నాయి. అలాగే డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్తాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పాన్ ఇండియా ఇమేజ్ను క్రియేట్ చేసిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక బన్నీకి జంటగా రష్మిక మందన కనిపించనుంది. ఇక పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఉండునుంది.
ఈ సాంగ్లో బన్నీతో కలిసి డ్యాన్సింగ్ క్వీన్ శ్రీ లీల చిందులేసింది. ఈ సాంగ్ ఆడియన్స్‌ను పిక్స్ లెవెల్లో ఎంటర్టైన్ చేయనుందట. ఇక ఇప్పటివరకు కేవలం పుష్ప సినిమా సిరీస్ ల కోసమే అల్లు అర్జున్ ఐదేళ్లు కేటాయించారు. ఈ క్రమంలోనే ఆయన కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. పుష్ప 2 రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అలా బుక్ మై షో లో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా బాహుబలి 2, కల్కి రికార్డులను బ్రేక్ చేశాడు పుష్పరాజ్. అంతేకాదు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే దమ్ము చూపిస్తున్నాడు పుష్పరాజ్. అలా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ఫ్రీ బుకింగ్స్ తో రూ.100 కోట్ల మార్క్ క్రాస్ చేసిందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. సినిమా రిలీజ్ తర్వాత మరికొన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిమానులు చెబుతున్నారు.
పుష్ప ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని.. ఈ సినిమాతో ఇప్పటివరకు ఉన్న పాన్ ఇండియా సినిమాల రికార్డులు అన్నిటినీ పుష్పరాజ్ బ్రేక్ చేస్తాడంటూ.. అభిమానులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, రావు రమేష్, సునీల్, అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు. పుష్ప 1కు మించే రేంజ్ లో ఈ సినిమా మాస్ జాతర ఉండనుందని.. యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంటాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకున్నాయి. సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. కాగా పుష్ప 2కోసం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నార్త్ ఇండియాలోనూ ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. పుష్పరాజ్ మాస్ జాతరతో దుమ్ములేపాడా తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.