‘ పుష్ప 2 ‘ ఫస్ట్ రివ్యూ.. పుష్పరాజ్‌గా బ‌న్నీ విశ్వరూపం చూపించాడా.. !

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. తెలుగు ఆడియోస్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ తో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక డిసెంబర్ 5 అంటే.. రేపు సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్స్ లోనూ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే పుష్ప ది రూల్ అవుట్ ఫుట్ విషయంలో అటు బన్నీ.. ఇటు సుకుమార్ తో పాటు సినిమాలో నటించిన నటీనటులంతా పూర్తి నమ్మకంతో ఉన్నారట‌.

ఇక ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. పుష్ప ది రూల్ మాస్ ప్రేక్షకులకు ఫుల్ మిల్స్ లా ఉంటుందని.. ఖర్చు విషయంలో మేకర్స్‌ ఎక్కడ రాజీ పడకుండా సినిమాను తెర‌కెక్కించినట్లు తెలుస్తోంది. ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్ ఇలా ప్ర‌తీ సీన్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ బ‌చ్చే విధంగా డిజైన్ చేశాడట సుకుమార్. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ స్టామినా ఏంటో పుష్ప 2తో మరోసారి పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌కు తెలియనుందని.. శ్రీ లీల స్పెషల్ సాంగ్, రష్మిక పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులలో హైలెట్ కానున్నాయని సమాచారం.

ఈ మూవీతో బ‌న్నీ బ్లాక్ బస్టర్ కొడుతుందంటూ అభిప్రాయాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. ఇక తాజాగా ప్రొడ్యూసర్ చెప్పిన విధంగానే మూవీ నడివి ఎక్కువగా ఉన్న.. ఎక్కడ సినిమా చూసే ఆడియోస్ కు బోర్ ఫీలింగ్ కలగదట. ఈ క్రమంలోనే పుష్ప దీ రూల్.. బెనిఫిట్‌షోల‌తోనే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ రేంజ్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించడం కేవలం పుష్పాది రూల్ విషయంలో మాత్రమే సాధ్యమైంది. ఇక దేవి శ్రీ ప్రసాద్,శ్యామ్ సీ ఎస్ ఇచ్చిన మ్యూజిక్ టాప్ లెవెల్ లో ఉండబోతుందని.. సినిమాలోని జాతర సీన్స్ పైసా వసూల్ రేంజ్ లో ఆకట్టుకుంటాయని.. ఆ సన్నివేశాల కోసమైనా సినిమాకు రిపీటెడ్ గా ఆడియన్స్ రావడం పక్కా అంటూ టాక్ నడుస్తుంది. ఈ సినిమాతో పుష్పరాజ్ మరోసారి మాస్ జాతర చూపించబోతున్నాడని.. బొమ్మ బ్లాక్ బ‌స్టర్ అంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.