‘ పుష్ప 2 ‘ రిలీజ్‌లో న‌యా ట్విస్ట్.. టికెట్ బుక్ చేసుకున్నోళ్ల పరిస్థితేంటి పుష్పరాజ్.. !

తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పుష్ప 2 ఫేవర్ కొనసాగుతుంది. ఎక్కడ చూసినా పుష్ప 2 పేరు మారుమోగిపోతుంది. కేవలం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తెలుగు ఆడియన్స్ అంతా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ రేంజ్లో బజ్ క్రియేట్ అయిన పుష్ప 2 మూవీని 3Dలో చూడాలని ఇప్పటికే చాలామంది ఆడియన్స్ టికెట్లు కూడా బుక్ చేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఓ బాడ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. పుష్ప 2 సినిమా 3D వెర్షన్ వర్క్‌ ఇంకా పూర్తి కాలేదని.. అందుకే పుష్ప 2.. 3D వర్షన్‌ రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం. డిసెంబర్ 13న పుష్ప 2.. 3D వర్షన్‌ రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట.

అప్పటికి 3D ప్రింట్స్‌ రెడీ అవుతాయని.. ఎగ్జిబిటర్లకు మేకర్స్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని ఇప్పటికే 3D మూవీ కోసం పుష్ప 2 టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నకు ఓ ప్రముఖ మల్టీప్లెక్స్ మేనేజర్ రియాక్ట్ అయ్యారు. ప్రేక్షకులు నిరాశ చెందాల్సిన పనిలేదని.. 3D షోలు క్యాన్సిల్ చేసిన అదే ప్లేస్ లో పుష్ప టు 2D వర్షన్ షోలు వేయబోతున్నట్లు వెల్లడించాడు. ఇక 3D టికెట్ రేట్లు ఎక్కువగా ఛార్జ్ చేస్తారు కదా.. ఆ డబ్బులు కేవలం 3D గ్లాస్సెస్ యూసేజ్ కోసమే టికెట్ ధరలో యాడ్ చేస్తారని.. అధిక చార్జ్‌లతో టికెట్లు బుక్ చేసుకున వారికి.. రీఫండ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు.

ఇక పుష్ప 2పై నార్తలోను విపరీతమైన బ‌జ్‌నెల‌కోన్న‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 2 హిందీ వర్షన్.. మిడ్ నైట్ షోస్ డిసెంబర్ 4న ప్రదర్శించాలని అనుకున్నా అది వర్కౌట్ కాలేదని.. ఈ క్రమంలోనే డిసెంబర్ 5 నుంచి రిలీజ్ అవ‌నునట్లు తెలుస్తుంది. పుష్ప 2 సినిమా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే అనుమతి ఇచ్చేసాయి. ఈ క్రమంలోని డిసెంబర్ 4 రాత్రి 9 గంటల నుంచి తెలంగాణ, ఏపీ, కర్ణాటక లాంటి ఏరియాలలో పుష్ప 2 ప్రీమియర్ షోస్ పడనున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ 5 అర్ధరాత్రికి పుష్ప 2 అంచనాలను అందుకుందో.. లేదో.. ప్రేక్షకులకు తెలిసిపోతుంది.

డిసెంబర్ 5న కూడా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరిగాయి. పుష్ప 2 సినిమా ఫస్ట్ డే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిన 12 గంటల్లోనే 3 లక్షలకు పైగా బుక్ అయ్యాయి. ఇప్పటికే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ బుకింగ్స్ తో రూ.100 కోట్ల కలెక్షన్లను క్రాస్ చేసేసింది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా వెల్లడించారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో.. తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.