‘ పుష్ప 2 ‘ అడ్వాన్స్ బుకింగ్స్ షాకింగ్ ఫిగర్.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు అంటే.. ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వ‌స్తున్న పుష్ప 2 ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పుడు ట్రేడ్ దృష్టి కూడా పుష్ప 2పైనే ఉంది. ఈ సినిమా లెక్కలు ఇండస్ట్రీ కాలుమానాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇప్పటికే పుష్ప 2 ది రూల్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బుకింగ్స్ ఓపెన్ అయినా కొద్ది గంట‌లోనే హాట్‌ కేకుల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షో కోసం ఇప్పటికే రూ.50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అలాగే పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్.. క్రాస్ ఇండియాలో దాదాపు ఇప్పటివరకు రూ.50 కోట్లకు పైగా జరిగిందని సమాచారం.

తొలి రోజు ఓవర్సీస్ వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్ నుంచి.. ఇంచుమించు రూ.50 కోట్ల గ్రాస్ వస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రూ.100 కోట్ల గ్రాస్ దాటిందని అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్ టికెట్ బుకింగ్స్ ఆలస్యంగా ఓపెన్ అయినా.. స్పెషల్ ప్రీమియర్ షోలకు టికెట్లు హాట్‌ కేకులా అమ్ముడుపోతున్నాయి. దీంతో.. ప్రీమియర్ కాకుండా.. కేవలం ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.150 కోట్ల దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. కొంచెం అటూ.. ఇటూలో ఇంకా ఎక్కువ కలెక్షన్ల రావచ్చట. ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో.. ప్రీమియర్ టికెట్స్ అత్యంత వేగంగా.. అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోయిన సినిమాగా కూడా పుష్ప 2 రికార్డ్ సృష్టించింది.

సినిమా విడుదలకు ఇంకా మరికొద్ది గంటల్లో ఉన్న క్రమంలో.. టికెట్ బుకింగ్స్ మరింత వేగవంతమయ్యాయి. సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1150 స్క్రీన్ లలో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్ లో 5000 స్క్రీన్స్.. ఇండియాలో 6500 స్క్రీన్ లలో సినిమాను ప్రదర్శించనున్నారు. బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్స్ సినిమాగా కూడా పుష్ప 2 రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు పుష్ప 2 ట్రైలర్‌తో 150 మిలియన్ వ్యూస్ సంపాదించిన మొట్టమొదటి సినిమాగా రికార్డ్ సృష్టించింది. అంతేకాదు.. రిలీజ్ అయిన 15 గంటల్లో 40 మిలియన్ ప్లస్ వ్యూస్ పొందిన ఫస్ట్ సౌత్ ఇండియన్ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇలా రిలీజ్‌కు ముందే రికార్డులు మడత పెడుతున్న పుష్పరాజ్‌.. రిలీజై బ్లాక్ బస్టర్ కలెక్షన్‌లు వస్తాయా అనే విష‌యం ట్రేడ్ వర్గాలకు కూడా ఊహాజనికంగా ఉందట. డిసెంబర్ 4 రాత్రి 9:30 నుంచి ఈ సినిమా ప్రీమియర్ షోలు మొదలుకానున్నాయి. అంటే డిసెంబర్ 5 అర్ధరాత్రి సమయానికి పుష్ప అంచ‌నాలు అందుకున్నాడో లేదో ప్రేక్షకులకు తెలిసిపోతుంది.