ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప 2 ఫీవర్ కొనసాగుతుంది. పుష్ప రాజ్ పేరు మారుమోగిపోతుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ఈ ఫుల్ ఆఫ్ మాస్ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా కనిపించనుంది. ఐటెం గర్ల్గా డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల మెరవనుంది. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పుష్ప 2పై పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. సినిమాపై ఉన్న అంచనాలు రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్ది పిక్స్ లెవల్‌కు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ బుకింగ్స్ లో సంచలనాలు క్రియేట్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించిన పుష్ప.. థియేట్రికల్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో చేసుకుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా నార్త్ ఇండియాలో థియేటర్ కల్ బిజినెస్ జరగడం నిజంగానే గ్రేట్ రికార్డ్. ఇక పుష్ప 2 దియేటర్ బిజినెస్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు బచ్చాయో ఒకసారి చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఇప్పటివరకు థియేట్రికల్ బిజినెస్ రూ.215 కోట్లు జరగగా.. నైజాంలో రూ.100కోట్లు, సీడెడ్ లో రూ.32 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.23 కోట్లు, ఈస్ట్ లో రూ.14.40 కోట్లు, కృష్ణలో రూ.12.40 కోట్లు, వెస్ట్ రూ. 10.80 కోట్లు, గుంటూరులో రూ.15.20 కోట్లు, నెల్లూరులో రూ. 7.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటకలో రూ.34 కోట్లు, తమిళనాడులో రూ.52. కోట్లు, కేరళలో రూ.100 కోట్లు, ఓవర్సీస్ + నార్త్ రూ.200 కోట్లు.
ఇక ఓవరాల్ గా పుష్ప 2 సినిమాకు ఇప్పటివరకు రూ.617 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.622 కోట్ల షేర్ కచ్చితంగా రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే.. పుష్ప ఫ్రీ బుకింగ్స్ లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు దాటిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా సులభంగా రూ.1000 కోట్లు కలెక్షన్లను దాటుతుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ప్రీమియర్ షోలు పడనున్నాయి. కాగా డిసెంబర్ 5న అర్ధరాత్రి సమయానికి.. పూర్తిగా పుష్పరాజ్ జాతర ఆడియన్స్ అంచనాలకు రీచ్ అయిందో.. లేదో.. తెలిసిపోతుంది.