ప్రస్తుత ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా.. పుష్ప 2 మానియా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పుష్పరాజ్ పేరు మారుమోగిపోతుంది. అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల అందరిలో పిక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. సినిమా మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా టికెట్స్ హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి. టికెట్ రేట్లు భారీగా పెరిగిన క్రమంలోనూ కాస్ట్ లెక్కచేయకుండా సినిమాను చూడడానికి ఆరటపడిపోతున్నారు అల్లు అర్జున్ అభిమానులు.
ఇక తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా నార్త్ లో టికెట్స్ బుక్ అవుతుండడం విశేషం. ఈ క్రమంలోనే ఢిల్లీ, ముంబై , పాట్నా , కోల్‌కత్త, బెంగళూరు, హైదరాబాద్ ఇలా పలుచోట్ల పుష్ప 2 మూవీ టికెట్ ధర రూ.1800 వరకు చేరుకుంది. ఈ క్రమంలో జాక్‌పాట్ ఆఫర్ అందిస్తుంది. పేటీఎం రూ.1800 ఉన్న టికెట్లు కేవలం రూ.100 కే సొంతం చేసుకున్న ఛాన్స్ ఇచ్చింది పేటీఎం. తద్వారా.. కావలసిన థియేటర్‌లలో.. యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డు ను ఉపయోగించి.. రెండు టికెట్లు తీసుకుంటే స్పెషల్ ప్రమోషన్ ఆఫర్ కింద ఫ్రీగా టికెట్లు పొందే అవకాశం ఉంది. బుక్ మై షో యాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలుస్తుంది. అంతే కాదు కొన్ని బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్స్ నుంచి ట్రాన్సాక్షన్ చేసిన.. 50శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది.
ఇక పివిఆర్ యాప్ తో వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే.. తక్కువ రేట్లకి టికెట్లు దక్కించుకోవచ్చు. ఢిల్లీ ముంబైలోని చాలా సింపుల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.100కే టికెట్లు దొరుకుతున్నాయి. జొమాటో లింక్ అయినా డిస్ట్రిక్ట్ యాప్ తో టికెట్లు బుక్ చేసుకుంటే.. మూవీ టికెట్లపై కొన్ని స్పెషల్ డీల్స్ కూడా ఉంటున్నాయి. రూ.999 కంటే ఎక్కువ మోతాదులో బ్లింక్ ఇట్ ద్వారా ఆర్డర్లు పెట్టుకుంటే తప్పకుండా తక్కువ ధరకే పుష్ప 2 టికెట్లు అందిస్తున్నారు. అంతేకాదు రూ.200 ఓచర్ కూడా పొందే అవకాశం ఉంది.