పుష్ప 2 ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో రూపొందిన ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా.. ఈరోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకే ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయా. రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో అలాగే పలు మల్టీప్లెక్స్ లలో భారీ ఎత్తున ప్రీమియర్స్ ప్లాన్ చేశారు మేకర్స్. నైజంలో అన్ని సింగిల్ థియేటర్లలో ప్రీమియర్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు.. తెలుగు సినీ ప్రేక్షకులంతా వెయిట్ చేసిన ఈ సినిమా.. వెంటనే చూడాలని.. ఆడియన్స్ టికెట్ ధరలు కూడా లెక్కచేయకుండా అసలు సినిమాకు టికెట్లు దొరికితే చాలు అనేంతల ఆరాటపడుతున్నారు.
ఈ ప్రభావం ప్రీమియర్ బుకింగ్స్ లో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ప్రీమియర్ టికెట్స్ కూడా హాట్ కేకుల క్షణాల్లో అమ్ముడుపోతున్నాయి. ఈ రేంజ్‌లో భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ విపరీతంగా అంచనాలు క్రియేట్ చేస్తున్న పుష్ప పై అందరిలోనూ ఒకటే డౌట్ నెలకొంది. అదేంటో కాదు పుష్ప 2.. ఆర్‌ఆర్ఆర్ ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేస్తుందా.. లేదా.. ఇదే డౌట్ ట్రేడ్ వర్గాల్లోనూ చర్చనీయంశంగా మారింది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్ఆర్ ఫస్ట్ డే ఏకంగా రూ.223 కోట్ల కలెక్షన్ రాబట్టి.. ఇండియన్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీ గా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఇప్పటికే పుష్ప 2 ఫ్రీ బుకింగ్ తోనే రూ.100 కోట్లను క్రాస్ చేసేసింది. ఇదే ఊపు ప్రీమియర్ షో ముగిసిన తర్వాత కూడా ఆడియన్స్‌లో ఉంటే.. మొదటి రోజు రాజమౌళి సినిమా ఆర్‌ఆర్ఆర్ రికార్డులు పుష్ప రాజ్ బీట్ చేస్తాడన్నడంలో సందేహం లేదు. ఇక బన్నీ అభిమానులు కూడా కచ్చితంగా పుష్ప 2 తో ఫస్ట్ డే.. బన్నీ జక్కన సినిమాల ఫస్డ్ డే రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 గంటల 20 నిమిషాల్లో రన్ టైంతో రానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో.. మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లను కొలగొడుతుందో తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.