నా కళ్ళ‌ని రష్మిక పైనే.. మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఆ డిస్కషనే లేదు.. సుకుమార్..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 విడుదలకు ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి క్రమంలో ఓవర్సీస్ మార్కెట్‌లో పుష్పరాజ్.. తన హవా చూపిస్తున్నాడు. దీంతో పుష్ప 2 మొదటి రోజు రూ.200 కోట్లకు పైగా ఓపెనింగ్ సాధించడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పుష్ప పార్ట్ 1 ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఇప్పుడు పార్ట్ 2 వంతు వచ్చింది.

I did Pushpa only for Allu Arjun: Sukumar - TeluguBulletin.com

మూడో భాగానికి సంబంధించి కూడా రష్మిక మందన ఇటీవల చిన్న హింట్ ఇచ్చింది. సుక్కుమార్ కూడా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ క్రేజీ అప్డేట్ను అందించారు. మీ హీరో నాకు రెండేళ్లు ఇస్తే పుష్ప 3 చేస్తా.. అంటూ సుకుమార్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ ఈవెంట్లో సుకుమార్.. బన్నీ గురించి రష్మిక మందన గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. రష్మిక గురించి సుక్కు మాట్లాడుతూ.. నా కళ్ళు ఎప్పుడు రష్మిక పైనే ఉండేవి. ఆ అమ్మాయి వెనకాల ఉన్నా కూడా తననే చూస్తూ ఉండిపోయే వాడిని.. అంతలా ఆమె నటించేసింది. మా ఇద్దరి మధ్యన ఎప్పుడు డిస్కషన్ లేదు.

Director SS Rajamouli speech At Pushpa The Rule Pre-Release Event | Allu  Arjun | Rashmika Mandanna - YouTube

మాకు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అంతలా కుదిరింది. నేను చెప్తే వెంటనే తను చేసేసేది. ఇది సరిగ్గా రాలేదు.. అసలు ఇది కాదు.. అన్న డిస్కషన్ ఎప్పుడు ఉండేది కాదు. అంతలా ఆమె నటించింది. ఒకవేళ తన్ను హీరో డైలాగ్ చెప్పేటప్పుడు వెనక ఉన్నా సరే.. ఎక్స్ప్రెషన్స్ అంతలా అద్భుతంగా పండించేది. నా కళ్ళు ఎప్పుడు ఆమె వైపే ఉండేవి ఆ రేంజ్ లో ఆమె ఎక్స్ప్రెషన్స్ నన్ను ఆకట్టుకున్నాయి అంటూ సుకుమార్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుకుమార్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో.. రష్మిక ఫ్యాన్స్ ఆనందని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఈ సినిమాలో తన నటనతో నేషనల్ అవార్డు దక్కించుకోవాలంటూ తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.