బీచ్ ఒడ్డున యోగ చేస్తున్న హీరోయిన్.. భారీ అలలకు కొట్టుకుపోయి మృతి..!

తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఓ యంగ్ హీరోయిన్ మృతి చెందింది. యోగ చేయడానికి బీచ్ ఒడ్డ‌కు వెళ్లిన ఆమె ఓ పెద్ద బండరాయిపై కూర్చుని ప్రశాంతంగా యోగ చేసుకుంటూ ఉండగా ఓ రాకసి అలా బలంగా ఆమె పైకి వచ్చి తనను సముద్రంలోకి లాక్కు వెళ్లింది. దీంతో సముద్రంలో పడిపోయిన ఆమె గల్లంతయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. రష్యన్ నటి కెమిల్లా బెల్యాట్స్కాయ సౌత్ లోనూ న‌టుడు రాఘవ లారెన్స్ తెర‌కెక్కించిన కాంచన 3 సినిమాలో నటించి ఆడియన్స్‌కు పరిచయమైంది. కాగా ఈమె తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి విహార‌యాత్ర కోసమే థాయిలాండ్ లోని ప్రముఖ టూరిజం ప్లేస్ కో స్యామ్యూయి ద్వీపానికి వెళ్ళింది.

Actress, 24, swept to her death by giant wave while doing yoga at her  favourite beauty spot on Thai paradise island | The Sun

ఇక.. తనకు ఇష్టమైన స్థలంలో యోగ చేసేందుకు ఒంటరిగా కారులో వెళ్లిన కెమిల్లా.. తనకు ఇష్టమైన ఆ ప్లేస్‌కు ఎన్నోసార్లు వెళ్లి యోగా చేసుకుందట. అయితే సంఘటన జరిగిన రోజు కూడా యోగ చేసేందుకు సముద్రం అడ్డుకు వెళ్లి చదునుగా ఉన్న ఓ పెద్ద బండరాయిపై కూర్చుని యోగా చేస్తున్న టైంలో.. ఒక్కసారిగా సముద్రపు అలలు పెద్ద ఎత్తున విజృంభించాయి. అలా ఓ పెద్ద అలా త‌న‌ను సముద్రంలోకి లాక్కెళ్ళిపోగా.. చాలాసేపటి వరకు చిక్కుకొని బయటపడేందుకు ప్రయత్నించింది.

Kanchana 3 Actor Alexandra Djavi Found Dead At Her Goa Residence At 24,  Probe Underway HD wallpaper | Pxfuel

ఈ దృశ్యాలు సిసిటివి లో రికార్డ్ అయ్యాయి. ఇక ఆమె కొట్టుకుపోయిన 15 నిమిషాలకు అక్కడికి చేరుకున్న రెస్క్యూటిమ్.. అలలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాసేపు మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో ఆమెను కాపాడలేకపోయారు. కొంత సమయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. పోలీసులు ఆమె మృత‌దేహం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ సంఘటన తర్వాత స్థానిక అధికారులు వ్యూ పాయింట్ ఎగువ‌న‌ ఉన్న ఆ ప్రాంతం యాక్సెస్ ని నిలిపివేశారు.