రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి డైరెక్షన్ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకుంటున్న వారిలో కొరటాల శివ ఒకడు. మొదట రచయితగా వ్యవహరించిన కొరటాల.. మిర్చి సినిమాతో దర్శకుడుగా మారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటూ మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడుగా సక్సెస్‌ఫుల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక చివరిగా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కి బ్లాక్‌బస్టర్ గా నిలిచిన దేవరతో పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కొరటాల.. ఈ రేంజ్ సక్సెస్ అందుకోవటానికి కారణం తన భార్య అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ప్రతి పురుషుని సక్సెస్ వెనక ఓ స్త్రీ ఉంటుందన్నట్లు.. కొరటాల శివ సక్సెస్‌కు ఆయన భార్య కారణమట.
కొరటాల భార్య పేరు అరవింద, లండన్‌లో ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ అమ్మడు.. కొరటాల నిజాయితీ నచ్చి.. అతనితో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. అయితే ఈ జంటకు అన్ని ఉన్నా.. వీళ్లకు ఉన్న ఏకైక లోటు పిల్లలు లేకపోవడం. అయినా అరవింద మాత్రం సమాజంలో చిన్న వాళ్ళు అంత తమ పిల్లలే అనే భావనతో అదే దిశగా కొరటాలని కూడా ప్రోత్సహించింది. ఇద్దరు బతకాలంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉంటే సరిపోతుందని అరవింద ఎక్కువగా చెప్తూ ఉంటుందట. ఇక ఆమె మొదటి నుంచి రామకృష్ణ పరమహంస భక్తురాలు కావడంతో అతన్ని బోధనలకు ప్రభావితం అయిందని.. ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం ఆమె రామకృష్ణ మఠానికి వెళ్లి అక్కడ సేవలు అందిస్తుందని సమాచారం. శ్రీమంతుడు కాన్సెప్ట్ కూడా ఈమె ఫిలాసఫి నుంచి పుట్టుకొచ్చిందట.
కోట్లు సంపాదించిన నేటికీ చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్న ఈ జంట.. ఎంత సంపాదించిన అవసరానికి మించిన డబ్బు ఉండకూడదని.. తినడానికి, బతకడానికి ఉంటే సరిపోతుందని.. మిగిలింది తిరిగి సమాజానికి ఇచ్చేయాలనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అందుకే సంపదలో ఎక్కువ భాగం సమాజసేవకే వినియోగిస్తూ.. ఆత్మ తృప్తి పొందుతుంటారు. అరవిందను ఎంతగానో ప్రోత్సహిస్తూ.. కొరటాలు కూడా ఈ సామాజిక సేవలో భాగమవుతున్నారు. ఇక ఇప్పటికే ఆయన ఎన్నో సందర్భాల్లో డైరెక్టర్ లైఫ్ కంటే.. నాకు మంచి వ్యక్తిగా, భర్తగా జీవితం చాలా నచ్చిందని అరవింద పై ఎన్నోసార్లు ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో ప్రస్తుతం అరవింద గురించి తెలిసినా నెటిజన్స్.. ఆమె క్యారెక్టర్‌కు ఫీదా అవుతున్నారు. ఇలాంటి భార్య దొరకడం నిజంగానే కొరటాల అదృష్టమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.