టాలీవుడ్ మోస్ట్ ఎవైతెద్ మూవీ పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరికొద్ది గంటల్లో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. పుష్ప 1 పూర్తయ్యేటప్పటికి పుష్ప 2 కథ కూడా వినలేదు. కానీ.. నాకు పూర్తి నమ్మకం ఉంది పుష్ప 2 అసలు తగ్గేదేలే అంటూ చెప్పుకొచ్చాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మిమ్మల్ని కలుస్తున్న. ఇక మా నిర్మాతలు మైత్రి నవీన్ గారు, రవి గారు వీళ్ళు కాకుండా ఈ సినిమాను మరి ఎవరు ప్రొడ్యూస్ చేయలేరు. మమ్మల్ని నమ్మి సినిమాపై కోట్లు ఖర్చుపెట్టినందుకు ధన్యవాదాలు. నా స్నేహితుడు డిఎస్పి గురించి ఎంత చెప్పినా తక్కువే.. మా జర్నీ 20 ఏళ్ల నుంచి కొనసాగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక పాహద్ ఫజల్ ఒక అద్భుతం అంటూ చెప్పిన బన్నీ.. ఫస్ట్ అఫ్ పూర్తయిన తర్వాత.. తన నట విశ్వరూపం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.. కేరళ వాళ్ళంతా చూసి గర్వపడేలా ఆయన నటించాడని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన శ్రీ లీల ఈ జనరేషన్ తెలుగు వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్.. టాలీవుడ్ గర్వించదగ్గ స్థాయికి మిమ్మల్ని తీసుకుని వెళ్లాలని కోరుకుంటున్న అంటూ చెప్పుకొచ్చాడు. ఐదు సంవత్సరాల నుంచి నాతో కలిసి పని చేసిన రష్మిక గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను కాకుండా వేరే వాళ్లయితే ఈ ఐదేళ్లు ఎలా గడిచేది కూడా నాకు తెలియట్లేదు. రెండు రోజులపాటు కనీసం నిద్ర కూడా లేకుండా.. ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఫిల్లింగ్ సాంగ్ కోసం వర్క్ చేసింది. నిద్రపోయావా అని అడిగితే లేదు అని చెప్పేది.. అది చూసి నాకు ఎంతో బాధనిపించింది.. ఈ సినిమా నీకు గొప్ప పేరు తీసుకొస్తుంది అంటూ అల్లు అర్జున్ కామెంట్స్ చేశారు.
ఇలాంటి అమ్మాయిలతో కలిసి పని చేయాలి అనిపించేలా నువ్వు వర్క్ చేసావ్ అంటూ బన్నీ రష్మికను ప్రసంసించాడు. దీంతో బన్నీ మాటలకు రష్మిక ఎమోషనల్ అయింది. ఇక సుకుమార్ గురించి మాట్లాడుతూ పుష్ప అంటేనే సుకుమార్ సినిమా. అయ్యను చూసి ఇంత గొప్ప డైరెక్టర్ తెలుగులో ఉన్నాడా అనుకునేలా పనిచేశ్తాడంటూ చెప్పుకొచ్చాడు. సినిమాను ప్రమోట్ చేయడం కోసం మేము దేశమంతా తిరుగుతుంటే.. ఆయన మాత్రం సినిమా మరింత బాగా రావాలని కష్టపడుతూనే ఉన్నాడు. ఈ సినిమా కోసం వీళ్లంతా కష్టపడ్డారనటం కంటే ప్రాణం పెట్టేశారు అనడం కరెక్ట్. సుకుమార్ గారు లేకుంటే ఇదంతా జరిగేది కాదు. ఆయన లేకుండా మేము లేము.. జీవితంలో అందరూ తమ ఐదు సంవత్సరాలు కాలాన్ని ఆయనను నమ్మి ఉంచాం అంటూ వెల్లడించాడు.
ఇక సుక్కుతో కలిసి ఆర్య సినిమా చేయకపోతే నేను లేను. ఇక ఓ సినిమా నా కోసం ఆడాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ మూడేళ్లు మాత్రం సినిమా కచ్చితంగా ఆడాలి హిట్ కొట్టాలి అనుకున్నా. సుకుమార్ గారి కష్టం చూసి ఎలాగైనా సినిమా హిట్ అవ్వాలని భావించేవాడిని. సినిమా కోసం మూడేళ్లు కష్టపడిన యూనిట్ కోసం సినిమా హిట్ అవాలనుకున్న. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలు వచ్చినప్పుడు తెలుగు వాళ్ళు గర్వించారు. తర్వాత పుష్ప సినిమాతో అంతస్థాయిలో సినిమా ఆడాలని.. తెలుగు వాళ్ళ కోసం ఈ సినిమా సక్సెస్ సాధించాలని అనుకున్నా. ఈ సినిమా కోసం మా బెస్ట్ పెట్టాం. డిసెంబర్ 5న సినిమా చూశాక మీకు కూడా అది అర్థమవుతుంది అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. చివరిగా సుకుమార్ మాటలు ఎమోషనల్ అయ్యానన్న బన్నీ.. తన ఫ్యాన్ ఆర్మీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు. ఇక సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు చెప్పిన బన్నీ.. లాస్ట్ లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకొంటివా.. ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ అంటూ డైలాగ్ చెప్పి ఎండ్ చేశాడు.