పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఆడియన్స్ అంత మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్న మూవీ పుష్ప 2. ఈ సినిమాపై ఇప్పటికి ప్రేక్షకుల్లో పిక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. టికెట్ రేట్లతో సంబంధం ఫ్రీ బుకింగ్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే హాట్‌ కేకుల అమ్ముడుపోతున్నాయి. అంటే పుష్ప 2 ఫీవర్ ఆడియన్స్‌లో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నార్‌లోను పుష్ప 2 క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అక్కడ కూడా బుకింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు పుష్పరాజ్. కాగా తాజాగా పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్గా జ‌రిపారు మేక‌ర్స్‌. ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ క‌నీళ్ళు పెట్టుకోవ‌డం హ‌ట్ టాపిక్‌గా మారింది.

Allu Arjun EMOTIONAL Hug To Sukumar at Pushpa 2 The Rule Pre Release Event  | Allu Arjun

ఇంత‌కి అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ మూవీ డైరెక్ట‌ర్ సుకుమార్ స్టేజ్‌పై మాట్లాడుతూ.. నేను బన్నీని ఆర్య నుంచి చూస్తున్నా.. తను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూనే వచ్చా. తనని వ్యక్తిగా, ఆర్టిస్టుగా ఇప్పటివరకు చూసా. పుష్ప సినిమా ఈ రేంజ్‌కు వచ్చిందంటే కేవలం నాకు, బన్నీకి ఉన్న ఓ బాండింగే దానికి కారణం. ఇక బ‌న్నీ ఒక సీన్ కోసమో.. లేదా ఒక సాంగ్ కోసమో కాదు. ఒక ఎక్స్ప్రెషన్ కోసం కూడా అంతలా కష్టపడతాడు. అది బ‌న్ని డెడికేష‌న్ అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం నీపై ప్రేమతోనే ఈ సినిమా తీశా.. నీతో ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు.. నా దగ్గర స్టోరీ కూడా పూర్తిగా లేదు. కేవలం క్యారెక్టర్ గురించి.. కొన్ని సన్నివేశాల గురించి చెప్పా.. అయినా నువ్వు నా పైన నమ్మకంతో ఓకే చెప్పేసావ్. నీకోసం నేను ఏమైనా చేయొచ్చు.. లవ్ యు బన్నీ అంటూ సుకుమార్ కామెంట్స్ చేశారు.

Allu Arjun gets emotional as Sukumar praises him at Pushpa 2 event - India  Today

అందరూ చెప్పినట్లే బన్నీ సెట్స్‌లో అందరిని కలిపి ఒక రేంజ్‌కు తీసుకెళ్లి కూర్చోబెడతాడంటూ వెల్లడించాడు సుక్కు. ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే అంటూ సుకుమార్ ఎమోషనల్ అయ్యాడు. దీంతో బన్నీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలా సుకుమార్.. రష్మిక గురించి, శ్రీ‌లీల‌ గురించి, నిర్మాతల గురించి టెక్నిషియ‌న్ల‌ గురించి మాట్లాడుతూ.. వాళ్ళంద‌రికి ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ క్రమంలో సుకుమార్ చేసిన కామెంట్స్‌కు అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకోవ‌డం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరిద్దరూ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు.. సుకుమార్ స్పీచ్ తో అర్థమవుతుందంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమాకు డిసెంబర్ 4 రాత్రి 9:30 నుంచి బెనిఫిట్స్ షోలు పడనున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 4 నుంచి పుష్పరాజు ఊచకోట చూస్తారంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.