టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. దీనికి స్పెషల్ గెస్ట్ గా రాజమౌళి హజరై సందడి చేశారు. ఇందులో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ.. పుష్ప 1 రిలీజ్ ఈవెంట్స్ సందర్భంలో ఇదే స్టేజ్ పై మాట్లాడుతూ.. నార్త్ ఇండియాను వదలద్దు బన్నీ.. అక్కడ ఫ్యాన్స్ నీకోసం చచ్చిపోతారు.. ప్రమోట్ చెయి సినిమా అని చెప్పా. మూడేళ్లు అయింది మళ్ళీ ఇదే స్టేజిపై పుష్ప 2కి బన్నీతో చెప్పాల్సిందేంటంటే.. ఈ సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదు. ఇప్పటికే ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా పుష్ప 2 టికెట్స్ కొనేసి ఉంటారు అని అర్థమయిపోతుంది. జనరల్ గా ఏదైనా సినిమా ఫంక్షన్‌కు వస్తే.. సినిమాకి ఏదైనా ఉపయోగపడేలాగా మాట్లాడాలి.
డైరెక్ట్ గురించైనా, హీరో గురించైనా, మ్యూజిక్ గురించి అయినా, కంటెంట్ గురించి అయినా.. ఏదైనా సినిమాకు ఉపయోగపడాలి. ఈ సినిమా గురించి అలాంటి మాటలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఓ సరదా విషయన్ని మీతో షేర్ చేసుకుంటా. సినిమా పొగడడం కన్నా.. సరదాగా జరిగిన విషయాన్ని ఒకటి మీతో పంచుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు జక్కన్న. రెండు, మూడు నెలల క్రితం ఏదో చిన్న పని ఉండి రామోజీ ఫిలిం సిటీ కి వెళ్ళా.. అక్కడ అప్పుడు పుష్ప షూటింగ్ జరుగుతుంది. సర్లేమని షూటింగ్ లోకేషన్ కి వెళ్ళా.. సుక్కు, బన్నీ ఇద్దరు అక్కడే ఉన్నారు. కొంచెంసేపు పిచ్చపాటి మాట్లాడిన తర్వాత సుక్కు సినిమాలో ఒక సీన్ చూస్తారా అని అడిగాడు. ఎందుకు చూడను చూపిస్తే చూస్తా అంటూ చెప్పా.. ఎడిటర్ని పిలిచి ఆ సీన్ ఏదో కరెక్షన్ చేసి చూపించు అన్నాడు.
ఎడిటర్ కరెక్షన్ చేస్తున్నాడు. ఈ లోపల బన్నీ, సుకు ఇద్దరు నాతో డిస్కషన్ మొదలెట్టారు. ఇలా ఒక పది నిమిషాలు దీని గురించే డిస్కషన్ పెట్టారు. తర్వాత సుకుమార్ సీన్ చూపించాడు. అదే ఇంటర్వెల్ సీన్ ఆఫ్ పుష్పరాజ్ అంటూ రాజమౌళి చెప్తూ ఈ సీన్ అంటుండగా.. సుకుమార్ టెన్షన్ గా చూడడం మొదలు పెట్టాడు. నువ్వు హార్ట్ ఎటాక్ తెచ్చుకోకు సుక్కు.. సీన్ నేను చెప్పట్లేదు. ఆ సీన్ ఎలా ఉంటుందో చెప్తా అంతే అంటూ నవ్వేసాడు. ఆ సీన్ చూసిన తర్వాత నేను ఒకే ఒక మాట అన్నా.. ఈ సీన్ కి దేవిశ్రీ ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంతా, ఎంత స్కోప్ చూపించగలిగితే అంతా.. ఏ రేంజ్కి తీసుకెళ్ళాలో అంతా ఎక్సలెంట్‌గా సీన్ చూపించాడు సుకుమార్.
బన్నీ యాక్షన్ ఇరగ కొట్టేసాడు అంటూ చెప్పుకొచ్చాడు. నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఒకటే చూసా.. ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో అర్థమయిపోయిందంటూ వెల్లడించాడు. డిసెంబర్ 5న కాదు డిసెంబర్ 4న సాయంత్రం ప్రపంచం మొత్తానికి సీన్ అర్థం అయిపోతుంది. నాకు నిజంగా ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పాలనిపించట్లేదు. ఈ సినిమాకు ఇంకేమని చెప్పాలి.. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ అజ్ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అదిగో వర్షం పడుతుంది.. హెవెన్ నుంచి బ్లెస్సింగ్స్ కూడా వచ్చేశాయి. డిసెంబర్ 4 ఈవినింగ్ పుష్పరాజ్ రూల్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అంటూ రాజమౌళి తన స్పీచ్ను ముగించాడు. ప్రస్తుతం రాజమౌళి.. సుకుమార్ పై వేసిన ఫన్నీ కౌంటర్ నెట్టింట వైరల్ గా మారుతుంది.