ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బ‌న్నీ థ్యాంక్స్ చూశారా.. ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు…!

గత కొద్ది కాలంగా అల్లు వ‌ర్సెస్ మెగా వార్ సోషల్ మీడియా వేదికగా జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్యలో పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనేంతలా వివాదాలు రాజుకున్నాయి. ఇలాంటి క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందిన పుష్ప 2 రిలీజ్‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో మెగా ఫ్యాన్స్ అంతా బన్నీపై పీకలోతు కోపంతో ఉన్నారు. ఎలాగైనా పుష్ప 2ను అట్టర్ ప్లాప్ చేసి తీరుతామంటూ సోషల్ మీడియా వేదికగా ఓపెన్ సవాళ్లు కూడా విసురుతో వస్తున్నారు.

Pushpa 2: The Rule Now Showing at Novo Cinemas - Book Your Tickets Now!

దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఐ డోంట్ కేర్ అంటూ.. ఏం పీక‌లేరు బ్ర‌ద‌ర్ అంటూ ప్ల‌కార్డ్‌ల‌తో వ‌రిని మ‌రింత‌గా రెచ్చ‌గొడుతున్నారు. ఇక బ‌న్ని వరుస ప్రమోషన్స్ లో బిజీగా గ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు థాంక్స్ చెప్ప‌డంతో ఈ ట్విట్ వైర‌ల్‌గా మారుతుంది. ఇంత‌కీ బ‌న్నీ ప‌వ‌న్‌కు థ్యాంక్స్ చెప్ప‌డానికి కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో పర్మిషన్లు రావాలంటే.. ఏపి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా దానికి అనుమతించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే పుష్ప 2 టికెట్ రేట్ల పెంపు విషయంలో నిన్న మొన్నటి వరకు ఎన్నో చర్చలు నడిచాయి.

Allu Arjun thanks Pawan Kalyan for Pushpa 2 ticket rates in AP |  cinejosh.com

అసలు దీనికి అనుమతి వస్తుందా.. లేదా అనే వార్త హ‌ట్‌ టాపిక్‌గా మారింది. ఇలాంటి క్రమంలో ఏపీ ప్రభుత్వం పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేసాడు. ఈ నిర్ణయం తెలుగు సినీ ఇండస్ట్రీ ఎదుగుదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందంటూ వెల్లడించిన బన్నీ.. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబుకు స్పెషల్ థాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. ఫిలిం ఇండస్ట్రీకి మద్దతుగా నిలుస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సిన్సియర్ థాంక్యూ అంటూ ట్విట్ చేశాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారుతుంది.