పుష్ప 2 ఫీవర్.. ఆంధ్రాలో భారీగా టికెట్ రేట్స్.. ఒక్కో టికెట్ ఎంతంటే.. ?

ప్రస్తుతం పుష్ప 2 ఫీవర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా పుష్ప పేరు మారుమోగిపోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా నటించిన పుష్ప సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. దీనికి సిక్వల్ గా వస్తున్న పుష్ప 2 పై ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తిని నెలకొల్పింది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ కళ్ళు కాయలుకాచేలా టాలీవుడ్ అభిమనలతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు, అల్లుఅర్జున్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

అంతేకాదు.. నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రమంలో.. టికెట్ రేట్లు ఎంత పెరిగినా ఓకే.. టికెట్ దొరికితే చాలంటూ ఆరాట పడిపోతున్నారు అభిమానులు. అంతేకాదు ఇప్పటికే పుష్ప 2 సినిమా టికెట్ రేట్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ బుకింగ్స్ మొదలైన 24 గంటలకే టికెట్లు హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి. ఎక్కడికక్కడ భారీ ధరకు టికెట్లు కొనుగోలు చేయడానికి కూడా అభిమానులు వెనకాడటం లేదు. ఒక్కో ఏరియాలో అయితే ఏకంగా ఒక్క టికెట్ రూ. 3000 వరకు చూపిస్తున్నా సరే.. అంత భారీ టిక్కెట్ల రేటు కూడా వెనకాడకుండా టికెట్లను బుక్ చేసుకుంటున్నారు జనం.

Ticket Prices Soar for Pushpa 2 Premiere in Andhra Pradesh - RTV English

ఇక నిన్నమొన్నటి వరకు ఏపీ తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో టికెట్ రేట్లకు పర్మిషన్ రావడంతో బుకింగ్స్ ఓపెన్ చేసి బుకింగ్స్ లో రికార్డులు సృష్టిస్తున్నాడు పుష్పరాజ్. ఇక‌ తాజాగా ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల భారీ పెంపుకు అనుమతినిచ్చారు. డిసెంబర్ 4న ప్రీమియర్ షో రాత్రి 9 గంటల ఆటకు ఒక్క టికెట్లు రూ.800 అదనంగా పెంచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్.. డిసెంబర్ 5న 6 షోలకు అనుమతిస్తూ.. గరిష్టంగా టికెట్ కు రూ. 200 వరకు పెంచుకోవచ్చని అనుమతినిచ్చింది. దీనికి తగ్గట్టుగానే పుష్ప టీంకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఒక ఆంధ్రాలోనే.. పుష్ప 2 మానియా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 2 ఆంధ్ర ఫ్రీ బుకింగ్స్ విషయంలో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.