మ‌త్తెక్కించే బ్యూటీ క్వీన్ ‘ సిల్క్‌స్మిత్ ‘ కెరీర్ ఇంట్ర‌స్టింగ్ ట్విస్టులు ఇవే..!

సిల్క్ స్మిత ఈ పేరుకు ఆడియ‌న్స్‌లో ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్పెషల్ సాంగ్స్‌కు క్యారాఫ్ అడ్రస్‌గా నిలిచినా ఈ అమ్మడు.. ఓ స్టార్ హీరోకు మించిపోయే రేంజ్‌లో పాపులారిటీ ద‌క్కించుకుంది. ఈ క్రమంలోనే అమ్మడు సినిమాల్లో లేకపోతే బయ్యర్లు కూడా సినిమాకు నో చెప్పేసేవారు. అలా తన 18 ఏళ్ల సినీ కెరియర్లో.. 450 సినిమాల్లో నటించిన ఈ అమ్మ‌డు.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త‌న స‌త్తా చాటుకుంది. ఇండస్ట్రీలోనే క్వీన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు.. ఓ పక్క ఐటమ్ గర్ల్ గానే కాకుండా.. మరో పక్కన వ్యాంప్‌ పాత్రలోనూ నటించి ఆకట్టుకుంది. అప్పట్లో కుర్ర కారుకు చెమటలు పుట్టించిన ఈ ముద్దుగుమ్మ.. స్టెప్స్ కు థియేటర్ అయిన ఆడిటోరియం అయినా బ్లాస్ట్ అవ్వాల్సిందే.

అయితే స్కిన్ వెండి తెరపై మెరిసినంత రంగుల ప్రపంచం ఈమెది కాదు. పర్సనల్ లైఫ్ లో ఎన్నో వడిదూడుకలను ఎదుర్కొంది. 1960 డిసెంబర్ 2న ప‌.గో.జిల్లాలో చిన్న పల్లెటూరు కావలిలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ అసలు పేరు.. వడ్లపాటి విజయలక్ష్మి. తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితిలో ఈమె చదును నాలుగో తరగతిలోనే మాన్పించేసి కొంతకాలానికి పెళ్లి చేశారు. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న ఈమె.. అత్తింటి వేధింపులను తాళ‌లేక అక్కడ నుంచి పారిపోయి చెన్నై ట్రైన్ ఎక్కేసింది. సినిమాలపై ఉన్న మక్కువతో మొదట్లో ఇండస్ట్రీకి అడుగుపెట్టి మేకప్ ఆర్టీస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చింది. ఇక 1979లో వండి చక్రం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు మూవీలో బార్‌ డాన్సర్ గా గ్లామర్ రోల్‌లో నటించింది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది.

Silk Smitha - Queen of the South Movie Announcement

దీంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కాగా ఆమె ఎన్నో సందర్భాల్లో తన నటించిన అన్నిటిలో వ్యాంప్ పాత్రలు అసలు నచ్చమని చెబుతూ ఉండేది. ఇక కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో ఆమె షాకింగ్ డేసిషన్ తీసుకుని ఫాన్స్ కు హార్ట్ బ్రేక్ చేసింది. ఆత్మహత్య చేసుకుని తుది శ్వాస విడిచింది. నేను మోస‌పోయానంటూ ఎమోష‌న‌ల్‌గా సూసైడ్ లెట‌ర్ రాసుకుంది. అప్పట్లో ఏమి మరణం పెద్ద సంచలనం. ఇక ఇప్పటికే ఆమె చనిపోయి 28 ఏళ్లు అవుతున్న సిల్క్ అనే పేరు వినిపిస్తే ప్రేక్షకుల్లో అదోరకమైన హుషారు వస్తుంది. అమ్మే తెలుగు ఆడియన్స్‌లో ఏ రేంజ్ లో ప్రభావాన్ని చూపించిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే సిల్క్ స్మిత బయోపిక్ కూడా త్వరలోనే స్క్రీన్ పై మెర‌వ‌నుంది. కాగా.. నేడు (డిసెంబర్ 2) స్మిత జయంతి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన గ్లంప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్. చంద్రిక రవి మెయిన్ లీడ్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సిల్క్ స్మిత.. క్వీన్ ఆఫ్ సౌత్ టైటిల్‌తో ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.