ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన.. తెలుగు మొస్ట్ అవైటెడ్ సినిమాల్లో పుష్ప 2 ఒకటి. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్ లో నెలకొన్నాయి. ఎంతలా అంటే.. పుష్ప పార్ట్ 1 వరల్డ్ వైడ్గా కేవలం రూ.145 కోట్ల థియెట్రికల్ బిజినెస్ చేయగా.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 ఏకంగా రూ.600 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీని బట్టి ఆడియన్స్‌లో పుష్ప 2పై ఉన్న క్రేజ్ అర్థమవుతుంది.
నైజంలో రూ.100 కోట్లు, ఆంధ్రాలో రూ.83కోట్లు, సీడెడ్ లో రూ.30కోట్లు.. ఇలా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.213 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక తమిళ్లో రూ.52కోట్లు, కర్ణాటకలో రూ.32కోట్లు, కేరళలో రూ.240 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. ఓవర్సీస్ లో రూ.100 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుపుకున్న పుష్ప రాజ్.. వరల్డ్ వైడ్‌గా రూ.617 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కచ్చితంగా పుష్పరాజ్ రూ.617 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టాలి. అంటే పుష్ప 2 హిట్ లిస్ట్‌కు రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ దక్కించుకోవాలి.
ఇక ఇది ఇండియన్ సినీ హిస్టరీలోనే హైయెస్ట్ థియెట్రికల్ బిజినెస్ జరుపుకున్న సినిమా కావడం విశేషం. బాహుబలి 2 తర్వాత.. రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ కూడా.. ఆ రేంజ్ లో బిజినెస్ అందుకోలేకపోయింది. ఆర్ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా.. పుష్ప 2 ఏకంగా.. రూ.600 కోట్లకు పైగా షేర్ వసూళ్ళను సొంతం చేసుకుంది. అంటే.. పుష్ప 2 హిట్ కావాలంటే ఆర్‌ఆర్‌ఆర్ రేంజ్ వసూళను రాబట్టాల్సి ఉంటుంది. బయ్యర్లకు ప్రాఫిట్స్ రావాలంటే అంతకుమించి ఎన్నో సంచలనాలు సృష్టించాలి.