ప్రస్తుతం పుష్ప 2 ఫీవర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా పుష్పరాజ్ పేరు మారుమోగిపోతుంది. మరో మూడు రోజుల్లో సినిమా గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్ ముందుకు రానుంది. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే సినిమా టికెట్స్ భారీగా పెంచేసినా.. ఫ్యాన్స్ అసలు లెక్కచేయకుండా సినిమా టికెట్స్ దొరికితే చాలని ఆరాట పడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓపెన్ బుకింగ్స్ తో ఊచకోత మొదలెట్టేసాడు పుష్పరాజ్. సినిమా రిలీజ్ ఇంకా మూడు మూడు రోజులు ఉండగానే.. ఆల్ ఓవర్ ఇండియాలో 15,754 షోలకి అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తయిపోయాయి. 25.37% ఆకీపెన్సి టికెట్స్ బుక్ అయినట్లు సమాచారం.
వీటి ద్వారా ఇప్పటివరకు మేకర్స్‌కు రూ.32.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చేసాయి. అంటే సినిమా రిలీజై పాజిటివ్ టాక్ వస్తే ఇంకా ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో ఊహకు కూడా అందదు. ఈ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ డిసెంబర్ 5 రిలీజ్ నాటికి రూ.60 కోట్ల మార్క్ క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.60 కోట్ల గ్రాస్ వసూళ్ళు వస్తే.. కచ్చితంగా అది బన్నీ కెరియర్ లోనే రికార్డ్ గా నిలుస్తుంది. ఇప్పటివరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో తెలుగు రాష్ట్రాల్లో రూ.16.35 కోట్ల గ్రాస్ రాగా.. హిందీ బెల్ట్ లో రూ.14.84 కోట్ల కలెక్షన్లు అందాయి. ఇక నార్త్‌లో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అది సాధారణ విషయం కాదు. పుష్ప 2కి అక్కడ ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో.. దీన్ని బట్టి అర్థమవుతుంది.
బుకింగ్స్ లో ఇదే జోరు కొనసాగితే రిలీజ్ సమయానికి రూ.60 కోట్లు ఈజీగా దాటేస్తుంది అనడంలో సందేహం లేదు. ఐకాన్ స్టార్ క్రేజ్, పుష్ప 2 మానియా ఈ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక.. సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తో ఆర్‌ఆర్ఆర్ రికార్డ్‌లని బ్రేక్ చేస్తుందని నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. అదే జరిగితే మూవీ వేయికోట్ల మార్కుని సులభంగా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బన్నీ మార్కెట్.. బ్రాండ్ ఇమేజ్.. పుష్ప 2 తర్వాత.. అమాంతం పెరగడం గ్యారెంటీ అని అభిమానులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ సినిమా సక్సెస్ పైనే బన్నీ నటించబోయే నెక్స్ట్ సినిమాల మార్కెట్ కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ దూసుకుపోతున్నాడు. తర్వాత బన్నీ కూడా ఈ లిస్టులో ఉంటాడని.. ఆశాభావాని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.