టాలీవుడ్ ఆడియన్స్ అంత మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చేస్తున్న పుష్ప 2 మరో మూడు రోజుల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాకు సీక్వల్‌గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప పార్ట్ 1 ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు ఎన్నో రేర్ రికార్డ్లు కొలగొట్టింది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సినిమాల్లో అల్లు అర్జున్ తన మేనరిజంతో లక్షలాదిమంది ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు.. ఆయన నటనకు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. ఈ సినిమాతో పుష్పరాజు సాధించిన రికార్డులు మరోసారి వైరల్‌గా మారుతున్నాయి.
పుష్ప 1లో అల్లు అర్జున్ నటనకు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ చరిత్రలోనే ఈ అవార్డు దక్కించుకున్న మొదటి హీరోగా రేర్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కు కూడా నేషనల్ అవార్డు వచ్చింది. 7 ఫిల్మ్ ఫేర్, 7 సైమా అవార్డులు కూడా దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్ల వసూళ్ళు చేసిన ఈ సినిమా.. హిందీలో 125 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. తెలుగు సినిమా బాలీవుడ్ లో ఈరోజు కలెక్షన్స్ సాధించడం ఒక రేర్ రికార్డు. ఇక ఇప్పటివరకు రిలీజై కలెక్షన్లు అల్లగొట్టిన టాలీవుడ్ సినిమాల్లో పుష్ప 8వ స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు.. ఈ ఏడది నిర్వహించిన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో సినిమాలో ప్రదర్శించారు. ఈ సినిమా తర్వాత రష్యన్ లోనూ డబై.. అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది.
ఇక సినిమా టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లో.. అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించి రికార్డ్ సృష్టించింది. ఏకంగా 24 గంటల్లో 28 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇక 2022లో యూట్యూబ్‌లో సిక్స్ బిలియన్ ప్లస్ వ్యూస్ సొంతం చేసుకున్న మొట్టమొదటి ఇండియన్ ఆల్బమ్‌గా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో డైలాగ్స్, పాటలు 10M+ రీల్స్ క్రియేట్ అయ్యాయి. 2022 అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది చూసిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఫిలిం అఫ్ ది ఇయర్ అవార్డును కూడా దక్కించుకుంది. ఇలా.. పుష్ప పార్ట్1తో లెక్కలేనని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్.. పుష్ప 2తో మరోసారి ఈ రికార్డులను బ్రేక్ చేసి సంచలన సక్సెస్ అందుకుంటాడో లేదో.. సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో వేచి చూడాలి.