75 కేజీల వ్యక్తి నాపై పడుకున్న.. భరించాల్సిందే మంగళవారం బ్యూటీ బోల్డ్ కామెంట్స్.. !

ఇండస్ట్రీలో సెలబ్రెటీస్ గా కొనసాగుతున్న చాలామంది నటీనటులు కథ డిమాండ్ చేస్తే వారి పాత్రలకు తగ్గట్టుగా రకరకాల గెటప్లలో మెరవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ లాంటివి కూడా నటించాల్సి ఉంటుంది. ఇది అనుకున్నంత ఈజీ కానేకాదు. చూసే వాళ్లకే కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతుందంటే.. అలాంటి సన్నివేశాల్లో నటించే నటీనటులకు ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇబ్బంది పడిన.. ఎవరేమన్నా.. బోల్డ్ సన్నివేశాలు నటించాల్సిన అవ‌స‌రం ఏర్పడితే.. వారు ఆ సీన్స్ లో నటించడానికి కూడా ముందడుగు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బెడ్ రూమ్ సీన్లపై మంగళవారం మూవీ ఫేమ్ దివ్య పెళ్లై షాకింగ్ కామెంట్స్ చేసింది. యూఏఈ లో స్థిరపడిన మలయాళీ ఫ్యామిలీకి చెందిన ఈ అమ్మ‌డు.. మొద‌ట‌ ఎయిర్ లైన్స్‌లో పనిచేశారు.

Mangalavaaram (2023)

ఇక‌ 2017లో ఆయిల్‌జనాల్లా అనే మలయాళీ చిత్రంతో ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడంతో అక్కడ బిజీ అయిన దివ్య.. తెలుగులో నవీన్ చంద్ర హీరోగా వ‌చ్చిన‌ తగ్గేదేలే సినిమాలొ హీరోయిన్‌గా క‌నిపించింది. ఇక ఈ అమ్మ‌డు కెరీర్ మలుపు తిప్పిన సినిమా మాత్రం మంగళవారం. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్‌లో.. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమాల్లో పాయల్‌ను మించిపోయే రేంజ్‌లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. జమీందారు భార్య రాజేశ్వరి దేవిగా అందం, పద్ధతిగా కనిపించి.. గ్రామ ప్రజలకు పెద్దగా చేతులెత్తి ముక్కించుకొని గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా కనిపించింది. క్లైమాక్స్‌లో బిగ్ షాక్‌.. ఆమె అక్రమ సంబంధం బయటపడకుండా హీరోయిన్‌ని చంపేసిన భయంకరమైన విలన్ గా అమ్మ‌డు విల‌నిజం కూడా చూపించారు.

Beautiful actress Divya Pillai in Green Saree | Hot Navel | ദിവ്യ പിള്ള -  YouTube

అలాంటి దివ్య పిళ్లై కెరీర్‌ మంగళవారం సినిమాతో ట‌ర్న్ అయ్యింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలో నటిస్తూ బిజీ అయింది. ప్రస్తుతం అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ మూవీ కీల‌క‌ పాత్రలో కనిపించనుంది. కాగా తాజాగా మంగళవారం సినిమాలో దివ్య బెడ్ రూమ్ సీన్స్ పై మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది. బోల్డ్ సన్నివేశాలు పై ఎదురైన‌ ప్రశ్నకు తనదైన స్టైల్ లో సమాధానం చెప్పింది. సెట్స్‌లో అందరు ముందు రొమాంటిక్ సన్నివేశాలు నటించడం అంత సులువు కాదని.. 75 కేజీల బరువున్న ఓ వ్యక్తి మనపై పడుకున్న.. ఏమాత్రం ఇబ్బంది లేకుండా నటించాలంటూ దివ్య చెప్పుకొచ్చింది. ఎంత ఇబ్బంది పడిన ఓపిగ్గా భరించాల్సిందే.. తప్పదంటూ ముఖంలో ఆ ఫీలింగ్స్ ను అస్సలు చూపించకూడదని.. ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దివ్య పిళ్లై కామెంట్స్ తెగ‌ వైరల్ గా మారుతున్నాయి.