” పుష్ప 2 ” కు అలాంటి కష్టం.. గండం నుంచి బన్నీ గట్టెకుతాడా..?

పుష్ప 2 ఫీవర్ ప్రారంభమైంది.. 5వ‌ తారీకున థియేటర్లో రానున్న సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పిక్స్ లెవెల్‌లో ఉన్నాయి. సినిమా రిలీజ్ అయిన మంచి టాక్ అందుకుంటే సరే సరి. అంచనాలు రీచ్ కాలేక బుడగపెల్లితే సినిమా పరిస్థితి ఏంటి..? వినోదం స్థాయి నుంచి వ్య‌సం స్థాయికి సినిమాను మార్చేశారు. రూ.200 టికెట్.. ఇప్పుడు దాదాపు రూ.2000కు చేరుకుంది. సినిమా బాగుండి.. ఆడియన్స్‌ను మెప్పిస్తే పెట్టిన డబ్బు సంగతి మర్చిపోతారు. అదే.. సినిమా ఫ్లాప్ అయితే పిచ్చి బూతులు తిట్టుకుంటారు. సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ రావడం ప‌క్కా. ఒకసారి షో పడి రిజల్ట్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోతుంది. ఇక పుష్ప 2 మొదట్లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి పాస్ మార్కులు మాత్రమే సంపాదించిన.. తర్వాత మెల్ల మెల్లగా ఊపు అందుకుంది.

బ్లాక్ బాస్టర్ రికార్డులను క్రియేట్ చేసింది. పుష్ప 2కి అసలు ఆ బాధే లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటికే భారీ లెవెల్లో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 11500 స్క్రీన్ లతో సినిమాను ప్రదర్శించనున్నారు. రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసి రూ.2000 కోట్ల వరకు వసూళ్లు వస్తాయని అంచనాలు వేసుకుంటున్నారు. అది జరగాలంటే వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలతో పాటు.. ప్రపంచంలో ఉన్న తెలుగు, ఇతర భాషల ఫ్యాన్స్‌ కూడా సినిమాను చూసేయాలి. సహజంగానే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే హీరో, డైరెక్టర్, నిర్మాతలపై భారీ ఒత్తిడి ఉంటుంది. సినిమా రిజల్ట్ వచ్చాక నోటికి 50 మార్కులు వచ్చిన ఏదో.. 80 మార్కులు వచ్చినట్లు కలరింగ్ ఇచ్చుకోవచ్చు. కానీ అసలు పాస్ మార్క్ కూడా రాకపోతే.. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ మొదలైపోతాయి. జేబులు ఖాళీ చేసుకున్న ఆడియన్ కోపం కట్టలు తెంచుకుంటుంది. అల్లు అర్జున్ గొప్ప నటుడు, సుకుమార్ కు కూడా ఆడియన్స్ను బోర్ కొట్టకుండా మెప్పించే కెపాసిటీ ఉంది.

కానీ.. పలు సందర్భాల్లో వీళ్లు కూడా చేతులెత్తేశారు. ఇక తాజాగా సూర్యా లాంటి టాప్ హీరోనే కంగువతో బోర్ల పడిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప 2 విషయంలో ఏకంగా ఆడియన్స్ పీక్స్ లెవెల్లో అంచనాలను పెట్టుకున్నారు. ఇందులో కొన్ని ప్లస్లు, మైనస్లు కూడా ఉన్నాయి. ప్లస్లు ఏంటంటే.. కథ‌ ఆల్రెడీ అందరికీ తెలుసు. పుష్ప మేనరిజం, ఎదుగుదల, మూర్ఖత్వం, ఎమోషన్స్ అన్ని పార్ట్ వన్ లో పరిచయం చేసేసాడు సుక్కు. కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పెళ్లయింది.. లవ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేయనవసరలేదు. వ్యాపారము ఫీడ్ అయిపోయింది. విలన్ షేకావత్, మంగళం శీను ఇంతవరకు క్లారిటీ ఉండనే ఉంది. ఈ బ్యాగ్రౌండ్ నుంచే కథ మొదలు పెట్టాలి.. ప్లస్ పాయింట్ కూడా ఇదే. ట్రైలర్ పుష్ప అంటే బ్రాండ్, ఇంటర్నేషనల్, వైల్డ్ ఫైర్ అంటూ మోగించారు. ఈ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చినప్పుడు పుష్పకి అక్కడ ఉండే లోకల్ విలన్లు చాలరు. పార్ట్ 1 లో పుష్పాకి విలన్ల స్థాయి పెరుగుతూ వచ్చింది.

లోకల్ ఫారెస్ట్ అధికారి, కొండారెడ్డి, మంగళం శీను, ఎస్పీ షేకావత్ ఇలా స్మగ్లర్ల నుంచి విలన్లు వచ్చే స్థాయికి ఎదిగింది. అధికారుల నుంచి కూడా స్థాయి పెరుగుతూ వచ్చింది. పార్ట్ 2 ఇంటర్నేషనల్ స్థాయి.. క‌నుక‌ విలన్ పొలిటికల్ సర్కిల్ నుంచి విలన్ పుష్ప రాజుకు పోటీగా దిగుతున్నాడంటూ.. స్టోరీలో అసలు ట్విస్ట్ అదే అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 ఆడియన్స్ ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా తెర‌కెక్కించి వారి మెప్పు పొందగలడా.. అసలు ఈ గండాని దాటుకొని పుష్ప 2 మంచి రిజల్ట్ అందుకుంటుందా.. అనే అంశాలు ఇప్పుడే హాట్‌ టాపిక్ గా మారాయి. పుష్ప పై ఉన్న ఒక అవగాహనతో పుష్ప 2 కాదని.. సులువుగా ఊహించొచ్చు. ఎర్రచందనం సామ్రాజ్యాన్ని పుష్ప మరింత విస్తరిస్తాడు. విలన్లను మరింత పవర్ఫుల్గా ఎదుర్కొంటు యాక్షన్ తో ఆకట్టుకుంటాడు. ఇక ఎమోషనల్ విషయంలోనూ మరింత స్ట్రాంగ్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాడు. రకరకాలుగా కథను డిజైన్ చేయవచ్చు. అయితే రెగ్యులర్ ఫార్మాట్ ను దాటుకుని కొత్త ప్రపంచాన్ని ఎమోషన్స్‌ని సుకుమార్ ఆడియన్స్ కు అందించగలడా.. వారిని మెప్పించగలడా.. ఈ గండం నుంచి పుష్ప గట్టిక్కుతాడా, లేదా.. తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.