టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీలలో ఒకటిగా నిలిచిన పుష్ప 2 మరో రెండు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 2 టికెట్ రేట్లపై మేకర్స్‌తో పాటు.. బన్నీ కూడా ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో.. అల్లు అర్జున్ చేసిన కొన్ని కామెంట్స్ ను వైరల్ చేస్తూ బన్నీ చెప్పిన మాటలనే అంతా ఫాలో అయితే.. ఇక పుష్ప 2 సినిమా పరిస్థితి అంతే అంటూ.. మీరు చెప్పిందే ఫాలో అయితే మీ సినిమానే ప్లాప్ అవుతుంది సార్ అంటూ.. రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. ఇంతకీ బన్నీ చేసినా కామెంట్స్ ఏంటో.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
బన్నీ గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా దగ్గర రూ.100 కోట్లు ఉన్న.. బిస్కెట్ ప్యాకెట్ రూ.10. నేను రూ.100 కోట్లు ఉన్నాయని.. రూ.10 బిస్కెట్ ప్యాకెట్ రూ.100 పెట్టి కొన్నాను. దాని విలువ పది రూపాయలే. అంతే కొనుక్కుంటా. నా దగ్గర రూ.1000 కోట్లు ఉన్నా రూ.10 బిస్కెట్ ప్యాకెట్‌కు ఎక్కువ రేటు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఎంత ఉంది అనేకంటే.. ఆ ప్రోడెక్ట్ విలువ ఎంత అనేది మాత్రమే నేను ఆలోచిస్తా అంటూ కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ చేస్తూ.. పుష్ప 2 టికెట్ రేట్లపై భారీగా మండిపడుతున్నారు జనం. రూ.100 కోట్లు ఆస్తి ఉన్న అల్లు అర్జున్ లాంటి వారే అంతగా ఆలోచిస్తే.. ఓ మధ్యతరగతి చెందిన మేమెందుకు మీ సినిమాకు వేలు పెట్టి టికెట్ కొనాలి అంటూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.
నేను రూ.100 కోట్ల ఆస్తి ఉన్నా ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి లాగే ఆలోచిస్తానని.. మా నాన్న, తాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు.. వాళ్ళకి అలవాట్లు డబ్బు సంపాదించిన పోలేదు. నేను అదే మెంటాలిటీతో పెరిగా.. అందుకే నేను ఎప్పటికీ మిడిల్ క్లాస్ వాడి మెంటాలిటీ తోనే ఆలోచిస్తా అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ. ఇప్పుడు అదే మిడిల్ క్లాస్ మెంటాలిటీ తో ఆడియన్స్ మిమ్మల్ని ఫాలో అయి ఆలోచిస్తే పుష్ప 2 రిలీజ్ అయిన మొదటి 4 రోజులు ఎవరైనా థియేటర్స్ కు వస్తారా.. ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమాకు టికెట్ రేట్లు పెంచారు. కానీ.. పుష్ప 2 రేంజ్‌లో ఏ సినిమా అయినా టికెట్ రేట్లు ఉన్నాయా అంటూ మ్డిపడుతున్నారు.