ఆ స్టార్ క్రికెటర్ తో అఖండ బ్యూటీ డేటింగ్..?

నందమూరి నట‌సింహం బాలయ్య హీరోగా నటించి బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేసిన మూవీలలో అఖండ ఒకటి. బోయపాటి డైరెక్షన్ వ‌చ్చిన ఈ సినిమాతో బాలయ్య గట్టి త్రో బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత వ‌రుస సినిమాల‌లో నటిస్తూ స‌క్స‌స్‌లు అందుకుంటున్న బాలయ్య.. త్వరలోనే అఖండ కు సీక్వెల్‌గా అఖండ 2 తాండ‌వం లో నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రగ్యా బాల‌య్య భార్య పాత్ర‌లో నటించనున్న‌ సంగతి తెలిసిందే. అలాంటి ప్రగ్యా జైస్వాల్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

కంచె సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసింది. తర్వాత పలు సినిమాలో నటించిన ఈ అమ్మడు.. బాలీవుడ్ లోను ప‌లు సినిమా అవకాశాలను దక్కించుకుని నటిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తను నటించిన ఓ హిందీ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. తాను ఒంటరిగా ఉన్నానని వెల్లడించింది. హుషారైన కుర్రాడితో డేటింగ్ కి సిద్ధంగా ఉన్నాను అంటు చెప్పిన ప్రగ్య.. ఓ స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేయడానికి రెడీనా అని ఇంటర్వ్యువర్ ప్రశ్నకు ఆనందం వ్యక్తం చేసింది.

Pragya Jaiswal raves about Balakrishna | cinejosh.com

ఎందుకు కాదు.. తప్పకుండా డేటింగ్ చేస్తా అంటూ చెప్పింది. ఇక యంగ్ క్రికెటర్ శుభమాన్‌ గిల్ పేరు చెప్పగానే.. ఈమె పెద్దగా నవ్వేసింది. తప్పకుండా డేటింగ్ చేస్తానని.. డస్టినీల‌ ఏది ఉంటే అదే జరగొచ్చు.. నేను డెస్టినీని నమ్ముతా అంటూ చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగాలన్నది నా డ్రీమ్. అది ఇంకా నెరవేరలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన డెస్టినీపై ఆమె ఎంతో స్పష్టంగా ఉంది. అది మారడం అసాధ్యం అన్నట్లుగా ప్రగ్య జేశ్వల్‌ కామెంట్ చేసింది. ఇక శుభ‌మ‌న్ గిల్.. స్ర‌స్తుతం క్రికెట్ గాడ్‌ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో ప్రేమాయ‌ణం నడుపుతున్నాడంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే అతనితో ప్రగ్యా జైస్వాల్ డేటింగ్ చేసే ఛాన్సే లేదు.