అక్కడ ” పుష్ప 2 ” ఒక్క టికెట్ కాస్ట్ రూ. 3000.. అది పుష్పరాజ్ రేంజ్..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సినిమా పుష్ప. ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా కోసం ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్గా.. శ్రీ లీల ఐటమ్ క్వీన్ గా మెరిసిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వెళ్లి చూద్దాం అంటూ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు.

ఎట్ట‌కేల‌కు ఆ స‌మ‌యం ఆనే వ‌చ్చింది. టాలీవుడ్ ప్రేక్షకుల ఎదురుచూపులు ఒక లెక్క అయితే.. నార్త్ ఆడియన్స్ ఈ సినిమా కోసం మరింత ఈగర్ గా వెయిట్ చేశారు. ఈ క్రమంలోనే పుష్ప 2 మూవీ టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే తెలంగాణ గవర్నమెంట్ టికెట్ రేట్ల భారీ పెంపుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది ఈ క్రమంలోనే ఒక్కో టికెట్ కు 350 నుంచి 500 కు పైగా టికెట్ రేట్లను ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్ ఇలాంటి క్రమంలో కేవ‌లం తెలంగాఫ‌లోనే కాదు అన్నిచోట్ల‌ కాస్ట్‌తో సంబంధం లేకుండా టికెట్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

ఓ ఏరియాలో ఏకంగా టికెట్లు రూ.3 వేలకు కూడా కొనుగోలు చేస్తున్నారు అభిమానులు. ఇంతకీ ఆ ఏరియా ఏదో కాదు.. సినిమాపై ఇప్పటికే పిక్స్ లెవెల్లో నెలకొన్న నార్త్ ముంబై. జియో వాల్‌డ్రైవ్ లోని పివిఆర్ లో.. ఒక్క టికెట్ ఏకంగా రూ.3 వేలకు అమ్ముడుపోతుండడం అందరికీ షాక్‌ను కలిగిస్తుంది. టికెట్ను అంత భారీ రేటుకు అమ్ముతున్న.. సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానులు.. ఎప్పటికప్పుడు వరుసగా బుకింగ్స్ చేసుకుంటున్నారు. దీంతో పుష్ప 2 క్రేజ్ మామూలుగా లేదంటూ.. అది పుష్పరాజు రేంజ్ అంటూ.. అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.