టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా ఉన్న పుష్ప 2.. మరో మూడు రోజులో రిలీజ్ కానున్నసంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాల్లో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. శ్రీలీల ఐటమ్ క్వీన్ గా మెరిసిన ఈ సినిమాపై.. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. పుష్ప పార్ట్ 1.. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న.. పుష్ప ది రూల్ సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ.. బన్నీ ఫ్యాన్స్‌తో పాటు.. సాధారణ ప్రేక్షకులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు.
అలాంటి సమయం రానే వచ్చింది. ఇక ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లు కూడా.. భారీ లెవెల్ లో జరిగాయి. ఇక నార్త్‌లో.. ఓపెనింగ్స్ తో బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. ఇలాంటి క్రమంలో తెలంగాణ గవర్నమెంట్ టికెట్ ధరల పెంపు విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు కనీవినీ ఎరుగన రేంజ్ మేకర్స్ టికెట్ రేట్లు పెంచేశారు. డిసెంబర్ 4న రాత్రి 9:30కు అలాగే.. 5న ఒంటిగంట షో, తెల్లవారుజామున 4 గంటల బెనిఫిట్ షోలకు టికెట్ పై రూ.800 పెంచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 5నుంచి 9వ తారీకు వరకు టికెట్ పై రూ.300, 9 నుంచి 18వ తారీకు వరకు టికెట్ పై రూ.200 వరకు పెంచుకునే పర్మిషన్లు ఇచ్చారు.
ఈ క్రమంలోనే మేకర్స్ కూడా టికెట్ రేట్లను భారీగా పెంచి.. బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇలాంటి క్రమంలో బన్నీ ఫ్యాన్స్ తో పాటు.. సాధారణ ప్రేక్షకులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బాయికాట్ పుష్ప 2.. అనే నినాదం ట్రెండింగ్‌గా మారింది. టికెట్ రేట్లను భారీగా పెంచడమే దీనికి ప్రధాన కారణం. మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్ రూ.500 నుంచి రూ.1000 మధ్యలో ఉండగా.. సింగల్ స్క్రీన్ లో సుమారు రూ.400 వరకు టికెట్ రేటు ఉంది. ఈ క్రమంలో ఒక ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూడాలంటే.. అది అసాధ్యమని.. కేవలం ఓ సినిమా కోసం ఇంతా ఎలా ఖర్చు పెట్టలంటూ ప్రేక్షకులు మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు.