ఆంధ్రాలో భారీగా పుష్ప 2 టికెట్ రేట్స్.. ఒక టికెట్ ఎంతంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన మోస్ట్ అవైటెడ్‌ మూవీ పుష్ప 2. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మరో మూడు రోజుల్లో పుష్ప 2 ది రూల్ సునామీ ప్రారంభం కానుంది. దీపావళి తర్వాత సరైన‌ సినిమా ఒక్కటి కూడా రాక అల్లాడిపోతున్న థియేటర్స్.. హౌస్ ఫుల్ అయ్యే టైం వచ్చిందని తెగ సంతోష పడిపోతున్నారు డిస్ట్రిబ్యుట‌ర్స్‌. కాగా మేకర్స్ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్ ను ప్రారంభించారు. టికెట్ రేట్లకు సంబంధించి అనుమతుల కోసం నిర్మాతల నిరీక్ష‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ప‌డింది.

Pushpa 2 Ticket Prices Revealed - RTV English

ఇక వెంటనే బుక్ మై షో, పేటీఎం, డిస్ట్రిక్ట్ లాంటి తదితర ఆప్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యిపోయాయి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపు ఏ రేంజ్‌ఉండబోతుందని ఆసక్తి నెలకొంది. కాగా మైత్రి మేకర్స్‌కు టికెట్ల పెంపుదల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఈ క్రమంలోనే తెల‌మ‌గాణ ప్రూవ్ చేయ‌గా.. ఏపీ డిప్యూటీ సీఎం తమ బ్యానర్ హీరో కావడంతో పాటు.. పరిశ్రమ తరపున ఎవరు ఏది అడిగినా నో చెప్పని మనిషి కనుక.. హైక్‌ గురించి అసలు మేకర్స్ టెన్షన్ పడడం లేదని సమాచారం. గరిష్టంగా దేవర కంటే ఎక్కువగా ఒక్క టికెట్ మీద రూ.150 నుంచి రూ.200 పెంపు అందుకోవచ్చని మేకర్స్ భావిస్తున్నారు.

Price hike for Pushpa 2 movie draws flak - The Hindu

అంటే మల్టీప్లెక్స్ రేట్లు రూ.400 మించి ఉండొచ్చు. ఈ క్ర‌మంలోనే రెండు రాష్ట్రాల్లో ఇంచుమించు ఇదే రేటు ఉండనుందని సమాచారం. ఇక‌ రెగ్యులర్ షోల సంగతి ఎలా ఉన్నా ప్రీమియర్ షోలకు మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట, తెల్లారిజామున 44 గం.. షోలకు ఏకంగా ఒక్క టికెట్ కు రూ.800 దాకా చార్జి చేయనున్నారట మేకర్స్. ముందు రోజుకు ఇది ఎన్ని వేల రూపాయలకు చేరుతుందో గెస్ చేయడం కూడా కష్టమే.. అనే రేంజ్ లో ప్రస్తుతం పుష్ప మానియా కొనసాగుతుంది. ఇక దాదాపు రెండు వారాలుగా థియేటర్లకు వెళ్లకుండా దాచేసిన డబ్బు అంతా పుష్ప 2 టికెట్ల కోసం ఖర్చు చేయడానికి జ‌నం సిద్ధపడుతున్నార లేదా చూడాలి. కాగా టికెట్ దొరకాలే కానీ.. కాస్ట్ విషయంలో అసలు వెనక్కి తగ్గేదేలే అంటూ ఎదురు చూస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.